Telangana: తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్వహణ కోసం నిధులు కావాలి, రూ. 53 వేల కోట్లు కేటాయించేలా కేంద్రానికి సిఫారసు చేయండంటూ 15వ ఆర్థిక సంఘానికి లేఖ రాసిన సీఎం కేసీఆర్

నీటిపారుదల మరియు తాగునీటి సరఫరా కోసం రాష్ట్రప్రభుత్వం పెట్టిన పెట్టుబడులు, కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని ఎలా ప్రశంసించారో సీఎం కేసీఆర్ మరోసారి లేఖలో గుర్తుచేశారు...

Telangana: తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్వహణ కోసం నిధులు కావాలి, రూ. 53 వేల కోట్లు కేటాయించేలా కేంద్రానికి సిఫారసు చేయండంటూ 15వ ఆర్థిక సంఘానికి లేఖ రాసిన సీఎం కేసీఆర్
Harish Rao with 15th Finance Commission Chairman NK Singh | File Photo

New Delhi, January 29: తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిరంతర అమలు, నిర్వహణ కోసం మరియు ప్రతీ ఇంటికి తాగునీరు అందించే ప్రధాన వాటర్ గ్రిడ్ ప్రోగ్రాం మిషన్ భాగీరథ కోసం రాబోయే ఐదేళ్లకు 52,941.25 కోట్ల రూపాయలు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని 15వ ఆర్థిక కమిషన్ కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఈ లేఖను రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు స్వయంగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్ కె సింగ్ కు అందజేశారు. ఈ సందర్భంగా లేఖలోని అంశాలను, నిధుల అవసరాన్ని మంత్రి హరీశ్ వారికి వివరించారు.

ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి తమ నివేదిక అందజేసే ముందు తెలంగాణలో ఉండే ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి అదనపు కేటాయింపులు జరపాలని సీఎం విన్నవించారు. కాళేశ్వరంలో 83 మీటర్ల నుంచి 618 మీటర్ల వరకు నీటిని ఎత్తిపోయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. నీళ్లకోసమే తెలంగాణ పోరాటం జరిగిందని లేఖలో గుర్తు చేసిన సీఎం కేసీఆర్, ఐదేళ్లలోనే కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ఎత్తిపోతల పథకాలు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు తెలిపారు.

ఈ ప్రాజెక్టుల నిర్వహణ కోసం రూ .40,169.20 కోట్లు, ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథకు రూ .12,772.05 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి తాగునీరు అందించే పథకాల కోసం అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తుందని, తెలంగాణ మరియు గుజరాత్ రాష్ట్రాలు ప్రాజెక్టులు ముందే పూర్తిచేసినందున, ఈ రాష్ట్రాలు నష్టపోకుండా చూడాలని కేసీఆర్ కోరారు. అలాగే పథకాల విద్యుత్ బిల్లులు, ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులకు సంవత్సరాల వారీగా నిర్ధిష్ఠమైన కేటాయింపులు జరిగేలా సిఫారసు చేయాలని 15వ ఆర్థిక సంఘానికి సీఎం కేసీఆర్ తన లేఖ ద్వారా వివరించారు.

ముఖ్యమంత్రి తన రెండు పేజీల లేఖలో, గతంలో ఆర్థిక సంఘం ఛైర్మన్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించినపుడు, ఇక్కడి మౌలిక సదుపాయాల కల్పన, నీటిపారుదల మరియు తాగునీటి సరఫరా కోసం రాష్ట్రప్రభుత్వం పెట్టిన పెట్టుబడులు, కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని ఎలా ప్రశంసించారో సీఎం కేసీఆర్ మరోసారి లేఖలో గుర్తుచేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)



సంబంధిత వార్తలు

SC Dismisses Jagan's Bail Cancellation Petition: జగన్‌ బెయిల్‌ రద్దుకు కారణాలేవీ లేవు, రఘురామ పిటిషన్ డిస్మిస్‌ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసును కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని వెల్లడి

UCC In Uttarakhand: సహజీవనం దాస్తే జైలుకెళ్లాల్సిందే, ఉత్తరాఖండ్‌లో నేటి నుంచి అమల్లోకి యూనిఫాం సివిల్ కోడ్ కోడ్, అసలేంటి ఈ ఉమ్మడి పౌర స్మృతి, యూసీసీపై సమగ్ర కథనం ఇదిగో..

KCR’s Sister Passed Away: కేసీఆర్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయన సోదరి చీటి సకలమ్మ కన్నుమూత.. నేడు అంత్యక్రియలు

Andhra Pradesh: చిన్నారిపై లైంగిక దాడి బాధాకరం..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్న ఎంపీ ప్రసాదరావు, బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడి

Share Us