Telangana: పేస్ట్ ధర ఎక్కువ అమ్ముతున్నారంటూ కోల్గేట్ కంపెనీపై పిటిషన్, రూ. 65 వేలు జరిమానా విధించిన సంగారెడ్డి వినియోగదారుల ఫోరమ్‌

ఎక్కువ ధరకు పేస్ అమ్ముతున్నారంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఆ న్యాయవాదితో ఏకీభవించిన న్యాయస్థానం కోల్గేట్ కంపెనీకి (Colgate Palmolive India) ఏకంగా రూ. 65 వేలు జరిమానా విధించింది.

Colgate Palmolive India (photo-Colgate Palmolive India)

Hyderabad, Jan 23: కొల్గేట్ కంపెనీకి తెలంగాణకు చెందిన న్యాయవాది భారీ షాక్ ఇచ్చారు. ఎక్కువ ధరకు పేస్ అమ్ముతున్నారంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఆ న్యాయవాదితో ఏకీభవించిన న్యాయస్థానం కోల్గేట్ కంపెనీకి (Colgate Palmolive India) ఏకంగా రూ. 65 వేలు జరిమానా విధించింది. ఈ కథనం వివరాల్లోకెళితే.. న్యాయవాదిగా పనిచేస్తున్న సీహెచ్‌ నాగేందర్‌ 2019 ఏప్రిల్‌ 7న సంగారెడ్డి పట్టణంలోని రిలయన్స్‌ ఫ్రెష్‌ రిటైల్‌ మాల్‌లో 150 గ్రాముల కోల్గేట్‌ మాక్స్‌ టూత్‌ పేస్ట్‌ రూ. 92కు కొనుగోలు చేశారు.

దీంతోపాటు 20 గ్రాముల కోల్గోట్‌ మాక్స్‌ టూత్‌పే‌స్ట్ రూ. 10లకు కొనుగోలు చేశారు. పది రూపాయలకు 20 గ్రాముల చొప్పున కొనుగోలు చేస్తే 150 గ్రాములకు రూ.75 అవుతుంది. కానీ 150 గ్రాముల పేస్ట్‌కు రూ.92 తీసుకున్నారు. రూ. 17 ఎక్కువ ఎందుకు తీసుకున్నారంటూ ఆయన కోల్గేట్‌ సంస్థ వారికి నోటీసులు పంపించారు.

అతడి నోటీసులకు కోల్గేట్‌ సంస్థ స్పందించకపోవడంతో ఆయన సంగారెడ్డిలోని వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. అతడి పిటిషన్‌ను విచారించి కోల్గేట్‌ సంస్థ అదనంగా వసూలు చేసిన రూ.17 తిరిగి ఇవ్వాలని చైర్మన్‌ పి.కస్తూరి, సభ్యురాలు డి.శ్రీదేవి తీర్పు ఇచ్చారు.

భర్తకు విడాకులు..సవతి కొడుకుతో పెళ్లి, కాపురం, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రష్యన్ బ్లాగర్, మళ్లీ సోషల్ మీడియాలోకి ఎక్కిన మెరీనా, ఇన్‌స్టాగ్రాంలో బేబీ ఫోటో షేర్

దాంతోపాటు ఆయనను మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.10 వేలు, ఖర్చుల కింద రూ. 5వేలు అదనంగా ఇవ్వాలని వినియోగదారుల ఫోరం ఆదేశించింది. వినియోగదారుల సంక్షేమ నిధికి అదనంగా రూ. 50 వేలు ఇవ్వాలని కోల్గేట్‌ సంస్థను ఆదేశించారు. మొత్తం రూ. 65 వేలు వినియోగదారునికి చెల్లించాలని వినియోగదారుల ఫోరం (District Consumer Disputes Redressal Commission) తేల్చి చెప్పింది. అయితే ఇవన్నీ కూడా నెల రోజుల్లోపు వినియోగదారుడు నాగేందర్‌కు చెల్లించాలని స్పష్టం చేసింది.