Telangana: ఆయుధాలను పరిశీలిస్తుండగా పేలిన గన్, హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి, మరొక ఘటనలో యువకుడిని పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి పారిపోయిన బాలిక

పోలీసు స్టేషన్‌లో తుపాకీ ( gun misfires in Kothagudem) మిస్‌ఫైర్‌ అయింది. ఈ ఘటనలో హెడ్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌ అక్కడికక్కడే మృతి చెందారు.

Representational Image (Photo Credits: ANI)

భద్రాద్రి కొత్తగూడేం జిల్లాలోని ఇల్లెందు మండలం కాచనపల్లిలో పోలీసు స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్‌లో తుపాకీ ( gun misfires in Kothagudem) మిస్‌ఫైర్‌ అయింది. ఈ ఘటనలో హెడ్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌ అక్కడికక్కడే మృతి చెందారు. నైట్‌డ్యూటీలో ఉన్న సంతోష్ శనివారం తెల్లవారుజామున ఆయుధాలను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన (Constable dies as gun misfires) జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. సంతోష్‌ మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలో సంతోష్‌ మృతదేహన్ని జిల్లా ఏఎస్పీ శ్రీనివాస్ సందర్శించారు.

ఇంకొక ఘటనలో ఇంటర్మీడియేట్‌ చదువుతున్న ఓ బాలిక కిడ్నాప్‌కు గురైంది. ఈ ఘటన గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రెజిమెంటల్‌బజార్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్‌ మీడియేట్‌ చదువుతుంది. ఈ నెల 9వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తల్లిదండ్రులు తెలిసిన వారు, బంధువుల వద్ద వాకబు చేసినా ఎక్కడా కనిపించ లేదు. సాయంత్రం వేళ ఆ యువతి తన ఫోన్‌ నుంచి తల్లికి ఫోన్‌ చేసింది.

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ప్రమాదంలో ముగ్గురు మృతి

తాను ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని అతన్ని పెళ్లి చేసుకునేందుకు వెళుతున్నానని చెప్పి పెట్టేసి అటు తర్వాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసింది. దీంతో కుటుంబ సభ్యులు గురువారం గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



సంబంధిత వార్తలు

Andhra Pradesh: వీడియో ఇదిగో, అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డుతో హెడ్ కానిస్టేబుల్‌ దారుణం, చేయి పట్టుకుని అసభ్య ప్రవర్తన, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Honour Killing in Telangana: లేడీ కానిస్టేబుల్‌ దారుణ హత్య, మృతురాలు నాగమణి భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన కాపీ వెలుగులోకి, పరువు హత్యతో పాటు ఆస్తి కోసం..

Telangana: నాగార్జునసాగర్ హైవేపై పోలీసులకు - బెటాలియన్ పోలీసు కుటుంబాలకు మధ్య తోపులాట..భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్, బ్రిటిష్ కాలం నాటి విధానాలను మార్చాలని డిమాండ్

Head Constable Dies by Suicide: మహబూబాబాద్‌ కలెక్టరేట్ లో విషాదం.. గన్‌ తో కాల్చుకుని హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. వీడియో వైరల్