Telangana Covid Updates: తెలంగాణలో తాజాగా 1,896 కరోనా కేసులు, కోవిడ్-19తో డీఎస్పీ మృతి, మృతి చెందిన వారి అంత్యక్రియల్లో పాల్గొంటే కరోనా రాదని తెలిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సోమవారం 18,035 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1896 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 82,647కు చేరింది. తాజాగా 8 మంది కరోనాతో మృతి (Covid deaths) చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 645కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. కోవిడ్ తో కొత్తగా 1788 మంది డిశ్చార్జ్‌ కాగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,374గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,628 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అందులో 15,554 మంది హోం లేదా ఇతరత్రా ఐసోలేషన్‌లో ఉంటున్నారు.

Coronavirus in Iran. (Photo Credit: PTI)

Hyderabad, August 11: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 1896 కరోనా పాజిటివ్‌ కేసులు (new Covid positive cases) నమోదయ్యాయి. సోమవారం 18,035 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1896 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 82,647కు చేరింది. తాజాగా 8 మంది కరోనాతో మృతి (Covid deaths) చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 645కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. కోవిడ్ తో కొత్తగా 1788 మంది డిశ్చార్జ్‌ కాగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,374గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,628 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అందులో 15,554 మంది హోం లేదా ఇతరత్రా ఐసోలేషన్‌లో ఉంటున్నారు.

రికవరీ రేటు (recoveries) దేశంలో 69.33 శాతం ఉండగా, తెలంగాణలో (Telangana) 71.84 శాతంగా ఉంది. సోమవారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 338, రంగారెడ్డి జిల్లాలో 147, కరీంనగర్‌ 121,మేడ్చల్‌ 119 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,42,875 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

యశోద ఆసుపత్రిలో కరోనా రోగి  బలవన్మరణం

మలక్ పెట్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి సోమవారం రాత్రి బలవన్మరణం చెందారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి(60) కరోనా పాజిటివ్ రావడంతో ఈ నెల 6వ తేదీన మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చేరారు. సోమవారం రాత్రి చికిత్స పొందుతున్న గదిలోని వాష్‌రూమ్‌కు వెళ్లి ఉరి వేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆసుపత్రి సిబ్బంది గమనించి చాదర్ ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. దేశంలో తాజాగా 53,601 కరోనా కేసులు నమోదు, 22 లక్షలు దాటిన మొత్తం కరోనా కేసులు, గత 24 గంటల్లో 871 మరణాలు, ఇప్పటివరకు కోవిడ్-19తో 45,257 మంది మృతి

ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై మంత్రి ఈటల రాజేందర్  ఆగ్రహం

ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో నిన్న సమావేశమైన మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ చికిత్సకు అధిక బిల్లుల వసూళ్లపై ఇప్పటి వరకు 1039 ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. ఫిర్యాదులు వచ్చిన ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని, లేదంటే 50 శాతం పడకలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

కరోనాతో డీఎస్పీ శశిధర్ మృతి

తెలంగాణలో డీఎస్పీ శశిధర్ కరోనాతో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈయన మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ డీఎస్పీగా పని చేస్తున్నారు. ఆయనకు ఇదివరకే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. శశిధర్ మృతిపై జిల్లా పోలీసు అధికారులు సంతాపం ప్రకటించారు.

మృతుల అంత్యక్రియల్లో పాల్గొంటే కరోనా రాదు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో సోమవారం కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి అంత్యక్రియల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొని వైరస్‌పై భయపడుతున్న వారందరికీ భరోసా కలిగించారు. కరోనాతో మృత్యువాత పడిన వారి అంతిమ సంస్కారాలకు కుటుంబసభ్యులు సైతం ముందుకు రాకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం నిర్వహించినంత మాత్రాన కరోనా సోకదన్నారు. పుదుచ్చేరిలో ఇద్దరు మంత్రులకు కరోనా, వారితో తిరిగిన వారు హోమ్ క్వారెంటైన్‌లో ఉండాల‌ని కోరిన సీఎం నారాయణ స్వామి, అక్కడ 5,624కు చేరిన మొత్తం కేసుల సంఖ్య

హైదరాబాద్‌లోని గాంధీ తదితర ఆస్పత్రుల్లో మృతి చెందిన రోగులను వారి పిల్లలే తీసుకెళ్లడానికి ముందుకు రాకపోవడం చూస్తుంటే మానవత్వం మంటగలుస్తోందన్నారు. కోవిడ్‌ నిబంధనల ప్రకారం ఐదుగురి నుంచి పది మంది వరకు పీపీఈ కిట్లు వేసుకుని అంత్యక్రియల్లో పాల్గొనవచ్చన్నారు. ఈ సందేశాన్ని అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో ఓ ప్రముఖుడి అంత్యక్రియలకు హాజరయ్యానన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ఆప్తులకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్నారు.

గ‌డిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా న‌మోదైన కేసులు

జీహెచ్ఎంసీ పరిధిలో 338

రంగారెడ్డి జిల్లాలో 147

కరీంనగర్ 121

మేడ్చల్ 119

వరంగల్ అర్బన్ 95

గద్వాల 85

జనగామ 71

కామారెడ్డి 71

ఖమ్మం 65

భద్రాద్రి 60

పెద్దపల్లి 66

సిద్ధిపేట 64