DGP Jitender: వారు సినిమాల్లోనే హీరోలు...బయట పౌరులే, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డీజీపీ జితేందర్, మోహన్ బాబుది ఫ్యామిలీ పంచాయితీ అన్న తెలంగాణ డీజీపీ
కరీంనగర్ జిల్లాలో మాట్లాడిన జితేందర్..అందరూ చట్టానికి లోబడి ఉండాలన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపర చర్యలు తీసుకుంటాం.. అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకత కాదు అన్నారు.
Karimnagar, December 22: సినిమా లో హీరో లు బయట పౌరులేనన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్. కరీంనగర్ జిల్లాలో మాట్లాడిన జితేందర్..అందరూ చట్టానికి లోబడి ఉండాలన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపర చర్యలు తీసుకుంటాం.. అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకత కాదు అన్నారు.
చట్టప్రకారం మేము యాక్షన్ తీసుకున్నాం..అరోజు జరిగిన సంఘటన దురదృష్టకరం అన్నారు. సినినటుడు మోహన్ బాబు పై కేసు నమోదు చేశాం..మోహన్ బాబుది వారి కుటుంబ సభ్యుల సమస్య అన్నారు. మీడియా ప్రతినిధుల దాడుల నేఫధ్యంలో లా ప్రకారం మోహన్ బాబు మీద యాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. అదో సినిమానా? స్మగ్లింగ్ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి...పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే ఓవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సినిమా నటులు బాధ్యాత రహితంగా ఉండటం సరికాదని, ఘటన జరిగిన తర్వాత కూడా సినిమా చూడటం ఏంటని ప్రశ్నించారు.
Telangana DGP Jitender on Allu Arjun Incident
అంతేగాదు ఇకపై తెలంగాణలో ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని స్పష్టం చేశారు. దీనిపై స్పందించారు అల్లు అర్జున్. తన క్యారెక్టర్‌ను కొంతమంది కావాలనే తప్పుగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు. జరిగిన సంఘటన అనుకోకుండా జరిగిందే తప్ప ఎవరూ కావాలని చేయరన్నారు.