Telangana Election Results 2023: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలకు షాక్, అనూహ్యంగా లీడింగ్‌లోకి వచ్చిన బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి
రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉండగా, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడ మూడో స్థానానికి పడిపోయారు
Assembly Election 2023 Results Live News Updates: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మూడో స్థానానికి కేసీఆర్ పడిపోయారు.కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉండగా, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడ మూడో స్థానానికి పడిపోయారు.
అనూహ్యంగా మొదటి రౌండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. కాగా రెండు, మూడు స్థానాల్లో కేసీఆర్, వెంకటరమణా రెడ్డి ఉండగా.. రౌండ్ రౌండ్‌కు ముగ్గురి మధ్య ఆధిక్యం మారుతూ వస్తుంది. 10 రౌండ్ల వరకు వెనుకంజలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఆ తర్వాత అనూహ్యంగా లీడ్ లోకి వచ్చారు. ప్రస్తుతం కాటిపల్లి వెంకట రమణా రెడ్డి 2100 ఓట్ల లీడ్ లో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో రేవంత్ రెడ్డి ఉండగా.. మూడో స్థానంలో సీఎం కేసీఆర్ కొనసాగుతున్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. ఇక దుబ్బాకలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఓటమి పాలయ్యారు. దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. రఘునందన్ రావుపై బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.