Barrelakka Manifesto: నిరుద్యోగుల అంశమే లక్ష్యంగా బర్రెలక్క మేనిఫెస్టో, ఏడు ప్రధాన అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన బర్రెలక్క అలియాస్ శిరీష

కొల్లాపూర్ లో తనను గెలిపిస్తే ఏం చేస్తాననే అనే విషయంపై తక్కువ అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించింది. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది.

Barrelakka (Photo-File Image)

Kollapur, Nov 2:  కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేస్తున్న బర్రెలక్క తాజాగా తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కొల్లాపూర్ లో తనను గెలిపిస్తే ఏం చేస్తాననే అనే విషయంపై తక్కువ అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించింది. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఇదిలా ఉంటే నిరుద్యోగుల తరపున బరిలో శిరీషకు పలు ప్రజాసంఘాలతో పాటు విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు మద్ధతు పలికుతున్నారు. జానపద కళాకారులు కూడా సపోర్టు ఇస్తున్నారు. మహిళల నుంచి మంచి స్పందన కూడా లభిస్తోంది.ఆమెకు ఈ ఎన్నికల్లో ఈసీ ఆమెకు విజిల్ గుర్తు కేటాయించింది.

బర్రెలక్క కుటుంబానికి వెంటనే రక్షణ కల్పించండి, తెలంగాణ డీజీపీని కోరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

కాగా ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని, అందుకే బర్లు కాసుకుంటున్నానని తీసిన వీడియోతో శిరీష బర్రెలక్క పేరుతో పాపులర్ అయింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామానికి చెందిన శిరీష తన వీడియోతో అప్పట్లో ప్రభుత్వానికి పెద్ద సవాల్ విసిరినట్టు అయింది. ఆ వీడియో ఆధారంగా అటు ప్రతిపక్షాలు, ఇటు నిరుద్యోగులు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. దీంతో ఆమె ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయింది. అప్పటి నుంచి శిరీషను బర్రెలక్కగా పిలుస్తున్నారు.

తమ్ముడిపై దాడి, భోరున విలపించిన బర్రెలక్క, తాను ఏం పాపం చేశానని ఇలా దాడులు చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్న కొల్లాపూర్ స్వతంత్య్ర అభ్యర్థి

తన ఇంటర్వూలతో కూడా వార్తల్లో నిలిచింది. ఓ దశలో ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో…. అనూహ్యంగా ఆమె నిరుద్యోగుల ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇప్పుడు ఇదే కొల్లాపూర్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రచారంలో దూసుకుపోతున్న బర్రెలక్కకు సోషల్ మీడియా, యూట్యూబర్స్ స్వచ్ఛందంగా ప్రచారం చేస్తూ చేయూతనిస్తున్నారు. ముందు లైట్‌గా తీసుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం ప్రస్తుతం ఆమెకు వస్తున్న ఆదరణను చూసి భయపడిపోయే స్థితికి వచ్చారు.

బర్రెలక్క మేనిఫెస్టోలో ఏం ఏం అంశాలు ఉన్నాయంటే..

1. నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా. సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా నిలదీస్తా.

2. పేదలకి ఇండ్ల నిర్మాణం కోసం కృషి చేస్తా

3. ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇప్పిస్తా

4. ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు

5. ఉచిత విద్య, వైద్యం కోసం పాటుపడుతా

6. నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు – ఫ్రీ కోచింగ్

7. యువత ఉన్నత చదువులకు ఫ్రీ కోచింగ్



సంబంధిత వార్తలు