Telangana Assembly Elections 2023: సన్నాసి అంటూ డీకే శివకుమార్‌పై సీఎం కేసీఆర్ ఫైర్, ఇల్లందు బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి

తెలంగాణ ప్ర‌జ‌ల హ‌క్కుల కోస‌మే పోరాడే పార్టీ అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

CM KCR (Photo-Twitter/TS CMO)

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోస‌మే పుట్టిన పార్టీ.. తెలంగాణ ప్ర‌జ‌ల హ‌క్కుల కోస‌మే పోరాడే పార్టీ అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. మాకు ఢిల్లీలో బాసులు లేరు.. మాకు బాసులు ఎవ‌రైనా ఉన్నారంటే అది మీరే త‌ప్ప ఇంకెవ‌రు లేరు అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మీరు ఏ ఆదేశం ఇస్తే, మీకు ఏది అవ‌స‌రం ఉంటే దానికే త‌ల‌వంచుతాం త‌ప్ప‌ మా బాసులు ఢిల్లీలో లేరు. ఇక్క‌డ వేరే ఏ పార్టీ గెలిచినా వారి క‌ట్క‌లు ఢిల్లీలో ఉంటాయి. స్విచ్ అక్క‌డ వేస్తేనే ఇక్క‌డ బ‌ల్బులు వెలుగుతాయని అన్నారు.

దళిత బంధు తెచ్చిన మొగోడు ఎవరైనా ఉన్నారా? సత్తుపల్లి బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ ఫైర్

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. కర్నాటక నుంచి ఓ పెద్దమనిషి వచ్చిండు ఉప ముఖ్యమంత్రి. కేసీఆర్‌ నీకు కావాలంటే బస్సుపెడుతం నువ్వు వచ్చి చూడు.. కర్నాటకలో రైతులకు ఐదుగంటల కరెంటు ఇస్తున్నమని చెబుతున్నడు. సన్నాసి మేం 24గంటల కరెంటు ఇస్తున్నం.. ఐదుగంటల కాదు. నువ్వు ఇక్కడ చూడాలి.. కర్నాటక వచ్చి చూసేది ఏముందని చెబుతున్నం. కాంగ్రెస్‌ నేతలు కరెంటు మూడుగంటల ఇస్తే సరిపోతుందని మాట్లాడుతున్నరు. మరి సరిపోతుందా మూడుగంటలు ? 24గంటల కరెంటు ఉండాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటువేయాలి’ అని పిలుపునిచ్చారు.

Here's CM KCR Speech Video

ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అసెంబ్లీ గడప తొక్కనివ్వమని మాట్లాడుతున్నారని.. అసెంబ్లీకి పంపేది మీరా? ఆ సన్నాసుల అంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్‌ పిచ్చి పట్టుకుందంటూ సీఎం కేసీఆర్‌ విమర్శించారు.

బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీకి ఓ పిచ్చిపట్టుకున్నది. ప్రైవేటైజేషన్‌ పిచ్చి. అన్ని ప్రైవేటు.. విమానాశ్రయం, ఓడరేవులు, రైళ్లు ప్రైవేటు. చివరకు దేశాన్ని ఏం చేస్తడో తెల్వదు. కరెంటు కూడా ప్రైవేటీకరణే. నన్ను కూడా బెదిరించారు. మీ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి రూ.5వేలకోట్ల బడ్జెట్‌ను కట్‌ చేస్తే.. ఐదేళ్లలో రూ.25వేలకోట్లు పోతయ్‌.. కానీ తలకాయ తెగిపడ్డా సరే మీటర్లు పెట్టా అని చెప్పిన. కారణం ఏంటంటే.. తెలంగాణ బతుకు ఏంటో నాకు తెలుసన్నారు.