Barrelakka Crying Video: తమ్ముడిపై దాడి, భోరున విలపించిన బర్రెలక్క, తాను ఏం పాపం చేశానని ఇలా దాడులు చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్న కొల్లాపూర్ స్వతంత్య్ర అభ్యర్థి
అయితే.. దాడి చేసింది ఏ పార్టీ వాళ్లు అన్నది తెలిదయని చెప్పింది. రాజకీయాలు అంటేనే రౌడీయిజం అని చాలా మంది అనేవారని.. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
Hyd, Nov 22: కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి నిరుద్యోగుల తరపున స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బర్రెలక్క అలియాస్ శిరీష నిలబడిన విషయం తెలిసిందే. అయితే.. నామినేషన్ వేసినప్పుడు ఒంటరిగా ఉన్న బర్రెలక్కకు.. ఇప్పుడు నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది.ప్రచారంలో భాగంగా కొల్లాపూర్ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బర్రెలక్కతో పాటు ఆమె సోదరునిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తమ్ముడిని కొట్టారు.
ఈ దాడిని గమనించిన మిగతావాళ్లు ఆ దుండగులను బెదిరించటంతో.. అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో బర్రెలక్కకు ఎలాంటి హాని జరగలేదు. అయితే.. దాడిని తలుచుకుని బర్రెలక్క బోరున విలపించారు. తాను ఏం పాపం చేశానని ఇలా దాడులు చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది. తన తమ్మున్ని తన కళ్ల ముందే కొట్టారని చెప్పుకొచ్చింది. వెంటనే పోలీసులకు ఈ దాడి విషయాన్ని చెప్పగా.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.
బర్రెలక్క కుటుంబానికి వెంటనే రక్షణ కల్పించండి, తెలంగాణ డీజీపీని కోరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
అయితే.. బర్రెలక్కపై దాడిని ఖండిస్తూ.. నిరుద్యోగ యువత ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో పోటీ చేస్తూ.. ప్రచారం చేసుకుంటుంటే.. ఇలా రౌడీయిజం చేయటమేంటని నిలదీస్తున్నారు. బర్రెలక్కకు ప్రొటెక్షన్ కల్పించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
Here's Video
ఓట్లు చీల్చుతాననే భయంతోనే తనపై కొంత మంది రాజకీయ నాయకులు దాడి చేపించారని బర్రెలక్క ఆరోపించింది. అయితే.. దాడి చేసింది ఏ పార్టీ వాళ్లు అన్నది తెలిదయని చెప్పింది. రాజకీయాలు అంటేనే రౌడీయిజం అని చాలా మంది అనేవారని.. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల కోసం పోరాడాటానికి వస్తే.. తనపై ఇలా దాడులు చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. నామినేషన్ వేసిన రోజు నుంచి ఇప్పటి వరకు తనకు ఎన్నో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. అయినా ఇప్పటివరకు తాను ఎవరి పేరు కూడా బయటపెట్టలేదని చెప్పింది. పోలీసులు తనకు మద్దతుగా నిలుస్తున్న వాళ్లకు రక్షణ కల్పించాలని బర్రెలక్క డిమాండ్ చేసింది.