Telangana Elections 2023: మూడు గంటల కరెంట్‌ కావాలా 24 గంటల కరెంట్‌ కావాలో తేల్చుకోండి, ఆర్మూర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్

అర్మూరులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని, రైతులకు 24 గంటల కరెంట్‌ అవసరం లేదని చెబుతున్నారని మండిపడ్డారు.

CM KCR in Solapur (Photo-Video Grab)

Hyd, Nov 3: దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్‌ ప్రజలకు ఏం మేలు చేసిందని BRS అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు. అర్మూరులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని, రైతులకు 24 గంటల కరెంట్‌ అవసరం లేదని చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయం పెరిగేకొద్దీ సంక్షేమ పథకాలు పెంచుతున్నామని చెప్పారు. తెలంగాణ కోసమే భారాస పుట్టిందన్న కేసీఆర్‌.. ఆర్మూర్‌ నియోజకవర్గ అభ్యర్థి జీవన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మూడు గంటల కరెంట్‌ కావాలా 24 గంటల కరెంట్‌ కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు.

రైతు బంధు దుబారా అని కాంగ్రెస్సోళ్లు అంటున్నారని, రైతు బంధు కావాలా వద్దా అనేది ప్రజలు తేల్చుకోవాలన్నారు.ఎవరో చెప్పారని ఓటు వేయద్దని ఏ పార్టీ మంచి చేసిందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటన్నారు. ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి ఇంకా రాలేదన్నారు. సరైన పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.

వీడియో ఇదిగో, గులాబీ తీర్థం పుచ్చుకున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్న మాజీ టీడీపీ నేత

అంకాపూర్ అంటే నాకు బాగా ఇష్టం. అంకాపూర్‌ను రైతులు ఆదర్శంగా తీసుకొని ఎదగాలి. తెలంగాణ రాక ముందు కరెంటు లేదు. తాగునీరు సాగు నీరు లేదు.. వలసలు ఉండేవి. దళిత బందు పథకం కనిపెట్టిందే నేను. దేశంలోనే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. ధరణి తీసేస్తామని కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నారు. తీసేస్తే రైతు బంధు ఎవరికి ఇస్తారు. ధరణి లేకపోతే మళ్లీ వీఆర్‌వోలు వస్తారు. మళ్లీ అవినీతి వస్తుంది. ప్రజల మధ్యే ప్రజల కోసం ఉండే జీవన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి’అని కేసీఆర్‌ కోరారు.

బైంసా ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌

ఓటు చేతిలో నుంచి జారిపోక ముందే అలోచించాలని, ఓటు వేయడంలో తప్పిదం జరిగితే తీవ్రంగా నష్టపోతాం. 24 గంటల కరెంట్ వద్దని రేవంత్ రెడ్డి అంటున్నారు. మహరాష్ట్రలో కరెంటు లేదు. మనదగ్గర కరెంటు ఉంది. ముథోల్, తానూర్, లోకేశ్వరం ‌మండలాల్లోని యాభై వేల ఎకరాలకు ఎస్సారేస్పీ నీరు అందిస్తాం. ప్రదానికి మోడికి పిచ్చి పట్టింది. విమానాలు, రైల్వేలు అన్ని ప్రైవేటు పరంచేస్తున్నారు. బైంసాలో బీజేపీ అభ్యర్థిని నిలదీయండి. ఎందుకు మోటర్లకు మీటర్లు పెడుతారని ప్రశ్నించండి. బైంసా అంటేనే యుద్దం అన్నట్లుగా చిత్రీకరిస్తు‌న్నారు. మతం పేరుతో మంటలు చేలరేగాలనా. రక్తం పారలనా..మీరే అలోచించుకోండి’అని కేసీఆర్‌ ప్రజలను కోరారు.

నేటి నుంచి తెలంగాణ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం, మొత్తం 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎన్నుకోవాలంటూ ఈసీ నోటిఫికేషన్

‘దేశ ప్రజాస్వామ్యంలో ఇంకా పరిణితి రావాలి. పోటీలో ఉన్న అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూసి ప్రజలు ఓటు వేయాలి. ఎవరో చెప్పారని ఓటు వేయొద్దు.తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి గుర్తు చేసుకోవాలి.ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందో చూడాలి. తెలంగాణ వచ్చినంకనే ఇంటింటికి నీళ్లిచ్చాం.24 గంటల కరెంట్‌ ఇచ్చాం.చేనేత కార్మికుల సంక్షేమానికి బడ్జెట్‌ పెంచుతాం. చేనేత కార్మికుల కష్టాలు నాకు తెలుసు.ధరణి తీసేస్తామని కాంగగ్రెస్‌ అంటోంది.ధరణి ఉండాలన్నా వద్దా తేల్చుకోవాలి’అని కోరుట్ల సభలో కేసీఆర్‌ ప్రజలను కోరారు.

ముథోల్ బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్

రాష్ట్రానికి ఒక్క‌ మెడిక‌ల్ కాలేజీ, ఒక్క న‌వోద‌య పాఠ‌శాల ఇవ్వ‌ని బీజేపీకి ఓటు ఎందుకు వేయాల‌ని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. గ్రామాల్లోకి వ‌చ్చే బీజేపీ అభ్య‌ర్థుల‌ను ఈ అంశాల‌పై నిల‌దీయాల‌ని కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు సూచించారు. ముథోల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

దేశంలో 157 మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేశారు. కానీ తెలంగాణ‌కు ఒక్క‌టి ఇవ్వ‌లేదు. 50 ఉత్త‌రాలు రాశాను. ఎందుకు ఇవ్వ‌లే. ఇదేం వివ‌క్ష‌. ఒక్క మెడిక‌ల్ కాలేజీ ఇవ్వ‌ని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలి. న‌వోద‌య విద్యాయాలు ఇవ్వ‌లేదు. 33 జిల్లాల‌కు న‌వోద‌య విద్యాల‌యాలు రావాలి. ప‌దేండ్ల నుంచి అడుగుతున్నా ఒక్క‌టి కూడా మంజూరు చేయ‌లేదు. మ‌రి న‌వోద‌య పాఠ‌శాల ఇవ్వ‌ని నాయ‌కులు ఏ ముఖం పెట్టుకుని బీజేపీ మ‌న‌ల్ని ఓట్లు అడుగుతుది. వారికి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్ప‌క‌పోతే మ‌నమీద‌నే దాడి చేస్త‌రు అని కేసీఆర్ పేర్కొన్నారు.

కులం, మ‌తం లేదు. తెలంగాణ ప్ర‌జ‌లంద‌రూ మ‌న బిడ్డ‌లే. ద‌ళిత స‌మాజం ఎప్ప‌ట్నుంచో వెనుక‌బ‌డి ఉన్నారు. అణిచివ‌తేకు గుర‌య్యారు. వారు సాటి మ‌న‌షులు కారా..? ద‌ళితుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఉంటే ఇవాళ ఈ ప‌రిస్థితి ఎందుకు ఉండేది. ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. ఈ ద‌ళిత బంధు స్కీం తెచ్చింది కేసీఆర్. త‌ప్ప‌కుండా ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి సాయం అందిస్తాం. ద‌ళితులు కూడా ఆలోచించి ఓటేయాలి అని కేసీఆర్ సూచించారు.

భైంసా, ముథోల్‌, నిర్మ‌ల్‌, ఆదిలాబాద్‌, హైద‌రాబాద్‌లో ముస్లింలు హిందువులు ఉన్నార‌ని కేసీఆర్ గుర్తు చేశారు. వంద‌ల ఏండ్ల నుంచి క‌లిసి బ‌తుకుతున్నాం. తాకులాట‌లు పెట్టి మ‌త‌పిచ్చి లేపి భైంసా అంటేనే యుద్ధ‌మ‌న్న‌ట్టు చిత్రీక‌రించి, త‌న్నుకు చ‌స్తార‌ని అబ‌ద్ధాలు చెప్పి ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ప‌దేండ్ల‌లో క‌ర్ఫ్యూ లేదు. లాఠీ ఛార్జి లేదు. ఫైరింగ్ లేదు. ప్ర‌శాంతంగా ఉన్న‌ది తెలంగాణ‌.

ఇలానే ప్ర‌శాంతంగా ఉండాల్నా.. మ‌త‌పిచ్చి మంట‌ల‌తోటి నెత్తురు పారాలా..? మీరు ఆలోచించాలి. ఎవ‌రి బ‌తుకు వారు బ‌తుక‌కా.. ద్వేషం పెట్టుకుని ఏం సాధిస్తాం. ఏమోస్త‌ది. క‌లిసిమెలిసి బ‌త‌క‌డంలోనే శాంతియుత‌మైన స‌హ‌జీవ‌నం ఉంట‌ది. అంద‌రం గొప్ప‌గా బ‌తుకగ‌లుగుతాం. మ‌న రాష్ట్రంలో ఉన్న అన్ని మ‌తాలు, కులాల వారు క‌లిసి ముందుకు పోవాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ప్రజలకు అందుబాటులో ఉండండి..పాత, కొత్త నాయకులు అంతా కలిసి పనిచేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్ త్వరలో వెల్లడిస్తానన్న ముఖ్యమంత్రి

KCR: 2025లో ప్రజలందరికీ మంచి జరగాలి..నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ భవన్‌లో క్యాలెండర్ ఆవిష్కరించనున్న కేటీఆర్

Yashasvi Jaiswal Out Video: వివాదాస్పదంగా మారిన య‌శ‌స్వి జైస్వాల్ ఔట్, థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పు బట్టిన మాజీ క్రికెట‌ర్ గ‌వాస్క‌ర్‌, వీడియో ఇదిగో..

Ind vs Aus 4th Test: రెండో ఇన్నింగ్స్‌లో 1 ప‌రుగుకే వెనుదిరిగిన నితీష్ రెడ్డి, బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియాపై 184 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం