IPL Auction 2025 Live

Disha Case Encounter: తెలంగాణ ఎన్‌కౌంటర్ కేసులో మరో మలుపు, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం, ఇప్పటికే హైదరాబాద్ పోలీసులకు నోటీసులు, చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని సందర్శించనున్న ఎన్‌హెచ్‌ఆర్సీ టీం

ఢిల్లీ నుంచి నలుగురు సభ్యుల బృందం హైదరాబాద్ (Hyderabad.) వచ్చింది. చటాన్‌పల్లి (chatanpally) ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం (NHRC Team) పరిశీలించనుంది. కాసేపట్లో శంషాబాద్ నుంచి చటాన్‌పల్లి ప్రాంతానికి ఈ బృందం వెళ్లనుంది.

national-human-rights-commission-team-reached-to-hyderabad (Photo-ANI)

Hyderabad, December 7: దిషా హంతకుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బృందం (National Human Rights Commission Team) శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంది. ఢిల్లీ నుంచి నలుగురు సభ్యుల గల బృందం హైదరాబాద్ (Hyderabad.) వచ్చింది.  చటాన్‌పల్లి (chatanpally) ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం (NHRC Team) పరిశీలించనుంది. కాసేపట్లో శంషాబాద్ నుంచి చటాన్‌పల్లి ప్రాంతానికి ఈ బృందం వెళ్లనుంది.

కాగా తెలంగాణ పోలీసులకు శుక్రవారం ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీచేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్చార్సీ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు ఆందజేయాలని పోలీసులను ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది. నిందితుల ఎన్‌కౌంటర్ మృతులకు ఇవాళ అంత్యక్రియులు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. మృతదేహాలను NHRC బృందం పరిశీలించిన తర్వాతే అంత్యక్రియలు జరగునున్నాయి. రేపు మధ్యాహ్నం తర్వాతే అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ANI Tweet

దిషా హత్య కేసులో పోలీసులు నిందితులపై జరిపిన ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం(The National Human Rights Commission) స్పందించిన సంగతి విదితమే. మీడియా(Media)లో వచ్చిన కథనాలను ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటో(suo moto)గా స్వీకరించింది. ఎన్‌కౌంటర్‌(Encounter)పై అత్యవసర దర్యాప్తుకు ఎన్‌హెచ్‌ఆర్సీ (NHRC) ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌ ఘటనను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించింది.

ఇందులో భాగంగా తెలంగాణ పోలీసులకు ఎన్‌హెచ్‌ ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి నిజనిర్ధారణ టీమ్‌ను పంపాలని ఆదేశించింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నలుగురు నిందితులు పోలీస్‌ కస్టడీలో ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్‌ కావడంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆందోళన వ్యక్తం చేసింది.

కాగా, దిషాపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ను నెటిజన్లు అభినందనలతో ముంచెత్తారు. ‘సాహో సజ్జనార్‌... శభాష్‌ సజ్జనార్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.



సంబంధిత వార్తలు