Fire at BRS Atmiya Sammelan: బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో పేలుడు, ఒకరు మృతి, పలువురికి గాయాలు, ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్

కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

BRS Atmiya Sammelan (photo-Video Grab)

Khammam, April 12: ఖమ్మంలోని వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌, ఇతర నేతలు పాల్గొన్నారు.

ఇంత మూఢనమ్మకమా.., దేవుడు చెప్పాడంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ, రాజేంద్రనగర్ లో దారుణం

కాగా నాయకులకు ఘన స్వాగతం పలుకుతూ పార్టీ కార్యకర్తలు భారీగా బాణాసంచా పేల్చారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న గుడిసెపై తారాజువ్వ ఎగిరిపడటంతో మంటలు అలుముకున్నాయి. బాణాసంచా ధాటికి గుడిసెలోని గ్యాస్‌ సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలవ్వగా.. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Here's Video

గాయపడ్డవారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఉన్నారు. పేలుడు ధాటికి విధులు నిర్వహిస్తున్న సీఐతో సహా పలువురి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. ఊహించని ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ అగ్నిప్రమాదంపైమంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలోని మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా అధికారులు, నాయకులను ఆదేశించారు. ఈ మేరకు వారితో ఫోన్‌లో సంభాషించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif