Hyd, April 11: హైదరాబాద్ రాజేంద్రనగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం రోడ్డుపైకి వచ్చిన మహిళ.. కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కాలిన గాయాలైన మహిళను ఆసుపత్రికి తరలించారు. వివరాలను ఇన్ స్పెక్టర్ నాగేంద్రబాబు వెల్లడించారు.
ఆలయంలో కుప్పకూలిన 100 ఏళ్ల నాటి వేపచెట్టు, ఏడు మంది మృతి, మరో 23 మందికి గాయాలు
అత్తాపూర్ లో శివాని అనే మహిళ బిచ్చమెత్తుకుని బతుకుతోంది. మెట్రో పిల్లర్ నంబర్ 133 వద్ద ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని తనకు తాను నిప్పు పెట్టుకుంది. దేవుడు చెప్పాడని శివాని ఆత్మహత్యకు యత్నించిందని పోలీసులు తెలిపారు. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా షాకైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్వేత ఘటనాస్థలికి చేరుకుని శివానిని 108 వాహనంలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.