Afzal Gunj Fire Accident: అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం, పక్కనే భారత్ పెట్రోల్ బంక్, మంటలను ఆర్పుతున్న 15 ఫైర్ఇంజన్లు, భారీగా నష్టం వాటిల్లినట్లు వార్తలు

అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

Fire (Representational image) Photo Credits: Flickr)

Hyderabad, April 7: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం (Afzal Gunj Fire Accident) చోటు చేసుకుంది. అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. భారీగా నిలువ ఉన్న టైర్ల గోదాంలో ఈ అగ్ని ప్రమాదం (Fire breaks out at tyre godown in Afzal Gunj) జరిగింది. గోదాం పక్కన ఉన్న గుడిసెవాసులు కపర్ వైరును కాల్చుతుండగా ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగాయి. అఫ్జల్‌గంజ్ పోలీస్ సిబ్బంది, స్థానికులు అక్కడ ఉన్న టైర్లను మరో చోటుకి తరలిస్తున్నారు.

ఇప్పటికే 15 ఫైర్ఇంజన్లు అక్కడ మంటలను ఆర్పుతున్నాయి. అఫ్జల్‌గంజ్ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలతో నిండిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గోదాం పక్కనే భారత్ పెట్రోల్‌ బంక్‌ ఉంది. ఇప్పటికైతే పెట్రోల్‌ బంక్‌కు ప్రమాదం జరగలేదు. కానీ, మంటలో అదుపులోకి రాకపోతే పెట్రోల్‌ బంక్‌కు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's Fire Video

ఈ ప్రమాదంలో భారీగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం. మరొక కథనం ప్రకారం టైర్లను కటింగ్ చేస్తున్న సమయంలో నిప్పంటుకుని మంటలు ఎగిసిపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అఫ్జల్ గంజ్, చాదర్ ఘాట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.