Telangana: వరంగల్ జిల్లాలో అబార్షన్ల ముఠా గుట్టు రట్టు, ఇద్దరు ప్రముఖ వైద్యులతో సహా 18 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, మీడియాకు వివరాలు తెలిపిన సీపీ రంగనాథ్‌

లింగనిర్ధారణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న 18 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వరంగల్‌ సీపీ రంగనాథ్‌ పేర్కొన్నారు

Warangal CP Ranganath (photo-Video Grab)

Hyd, May 29: వరంగల్‌ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అబార్షన్‌లు చేస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. లింగనిర్ధారణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న 18 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వరంగల్‌ సీపీ రంగనాథ్‌ పేర్కొన్నారు.నిందితుల నుంచి లింగనిర్ధారణకు వినియోగించే మూడు స్కానర్లు, రూ. 73 వేల నగదు, 18 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

నర్సంపేట కేంద్రంగా పెద్ద ఎత్తున లింగనిర్ధరణ పరీక్షల దందా సాగుతోందని ఇందులో భాగంగా లోటస్‌ ఆస్పత్రి యజమాని, వైద్యులను అరెస్టు చేశాం. స్కానింగ్‌ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం. ఆయుర్వేద వైద్యులు కూడా గర్భస్రావాలు చేస్తున్నారు. బాధ్యులైన వైద్యులు, సిబ్బంది అందరినీ పట్టుకున్నాం. ఈ విషయంపై వైద్యశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీపీ రంగనాథ్‌ చెప్పారు.

కొడుకులు ఆస్తి కోసం గొడవ చేస్తారని భయం, చనిపోయిన భర్తకు ఇంట్లోనే అట్టపెట్టెలతో దహన సంస్కారాలు చేసిన భార్య, కర్నూలు జిల్లాలో షాకింగ్ ఘటన

ప్రధాన నిందితుడైన వేముల ప్రవీణ్‌ పాత నేరస్తుడిగా గుర్తించారు. గతంలో స్కానింగ్ కేంద్రంలో టెక్నీషియన్ గా పనిచేసి నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్థారణ పరీక్షలు చేసి అరెస్టయ్యాడు.గత అనుభవంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. నిందితుడు వేముల ప్రవీణ్ ఆర్‌ఎంపీలు, పీఆర్‌ఓలు, హాస్పిటల్ మెనెజ్‌మెంట్‌, డాక్టర్లతో కలిసి అక్రమ దందా పాల్పడుతున్నాడని సీపీ తెలిపారు.

బాలికను కత్తితో 20 సార్లు పొడిచిన రాక్షసుడు వీడే, యూపీలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హామీ

ప్రవీణ్ భార్య సంధ్యారాణితో కలిసిగోపాల్ పూర్ వెంకటేశ్వర కాలనీలో పోర్టబుల్ స్కానర్ల సహయంతో స్కానింగ్ ఏర్పాటు చేశాడు. ఇప్పటి వరకు వందకు పైగా అబార్షన్‌లు చేసిన ముఠా ఇదని అన్నారు. స్కానింగ్​ అయితే రూ. 10 వేలు తీసుకుంటున్నారు. గర్భ‌స్రావాల కోసం ఒక్కొక్క‌రి నుంచి రూ. 30 వేలు వ‌సూలు చేస్తున్న‌ట్లు త‌మ ప‌రిశీలన‌లో తేలింద‌ని సీపీ పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు ఉన్నారని చెప్పారు. మరికొందరు పరారీలో ఉన్నారని తెలిపారు.

‘ఆపరేషన్‌ దేశాయ్‌’ ద్వారా అక్రమంగా లింగనిర్ధారణ, అబార్షన్‌లు చేసే ఇద్దరు వైద్యులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. నర్సంపేటకు చెందిన ప్రముఖ మహిళా వైద్యురాలు, నెక్కొండకు చెందిన ఒక వైద్యుడితోపాటు స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులు, ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో పలు విషయాలు వెలుగు చూశాయి.

నర్సంపేట, నెక్కొండ, హనుమకొండ, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో గర్భస్రావాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని గ్రామీణ ప్రాంతాల నుంచి గర్భిణులను లింగనిర్ధరణ పరీక్షల కోసం నగరానికి తీసుకొస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 200 మందికి అబార్షన్లు చేయించి ఉంటారని.. ఈ మేరకు విచారణలో వెల్లడైందని తెలిపారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..