Representative image. (Photo Credits: Unsplash)

Kurnool, May 29: ఏపీలో క‌ర్నూల్ జిల్లా ప‌త్తికొండ‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన భర్తకు ఇంట్లోనే భార్య దహన సంస్కారాలు నిర్వహించింది. పత్తికొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప‌త్తికొండ‌కు చెందిన హ‌రిప్ర‌సాద్(60) త‌న భార్య ల‌లిత‌తో క‌లిసి ఉంటున్నాడు. వీరిద్దరూ మెడికల్‌ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు దినేశ్‌ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుండగా.. చిన్న కుమారుడు కెనడాలో స్థిరపడ్డారు.

బాలికను కత్తితో 20 సార్లు పొడిచిన రాక్షసుడు వీడే, యూపీలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హామీ

అయితే సోమవారం ఉదయం ఇంటి ఆవ‌ర‌ణ‌లో హ‌రిప్ర‌సాద్ మంట‌ల్లో కాలిపోయిన దృశ్యాల‌ను స్థానికులు గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు.ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు ల‌లిత‌ను విచారించారు. తన భర్త అనారోగ్యంతో సోమవారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులకు లలిత తెలిపింది.

కరెంటు పోల్‌ నిలబెడుతుండగా ఆరుమందికి విద్యుత్ షాక్‌, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన కూలీలు, జార్ఖండ్‌లో విషాదకర ఘటన

కుమారులిద్దరూ తమను సరిగా చూసుకోవడం లేదని.. ఆస్తి కోసమే తమ వద్దకు వస్తున్నారని ఆమె తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. తండ్రి చనిపోయిన విషయం తెలిస్తే కుమారులిద్దరూ వచ్చి ఆస్తి కోసం గొడవ చేస్తారని.. ఆ భయంతో తానే భర్తకు అట్టపెట్టెలతో దహన సంస్కారాలు పూర్తిచేసినట్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.