Godavari Floods: గంట గంటకు పెరుగుతున్న గోదావరి నది నీటి మట్టం, భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ, ముంపు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు 38.70 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం బుధవారం ఉదయానికి 50 అడుగులకు (Godavari crosses Nearly 50 feet level ) చేరువైంది.

bhadrachalam godavari

Hyd, August 10: తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు 38.70 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం బుధవారం ఉదయానికి 50 అడుగులకు (Godavari crosses Nearly 50 feet level ) చేరువైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక ( Second warning issued) జారీచేశారు.ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నదిలో 12,11,032 క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నది. నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు.

గోదావరి ప్రవాహం గంటగంటకూ పెరుగుతూ వస్తున్నది. మంగళవారం సాయంత్రం 43.5 అడుగులుగా ఉన్న నీటిమట్టం.. అర్ధరాత్రి ఒంటి గంటకు 48 అడుగులకు చేరింది. బుధవారం గోదావరికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.గోదావరికి వరద మరోసారి పోటెత్తడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, సారపాక, అశ్వారావుపేట, పినపాక, ఏడూళ్లబయ్యారం తదితర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్‌ అనుదీప్‌ కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌లో ఉగ్రవాద దాడులపై తెలంగాణ పోలీసులను అలర్ట్ చేసిన ఐబీ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భద్రత కట్టుదిట్టం చేసిన తెలంగాణ పోలీస్ శాఖ

ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి వస్తున్న వరదలతో గోదావరి 55 అడుగులు దాటే అవకాశమున్నందని, ముంపు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరించారు. జాలర్లు చేపలవేటకు వెళ్లొద్దని, ప్రజలు వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించొద్దని సూచించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో దుమ్ముగూడెం మండలంలో సున్నంబట్టి–బైరాగులపాడు ప్రధాన రహదారిపైకి వరద భారీగా చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాలలోని సీతమ్మ నారచీరల ప్రాంతం ముంపునకు గురైంది. తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో మంగళవారం 9 గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

CM Revanth Reddy: రూ.192 కోట్లతో మెదక్‌ జిల్లాలో అభివృద్ధి పనులు, ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పలు శంకుస్థాపనలు