Telangana DGP Mahender Reddy (File photo)

Hyd, August 10: ఆగస్టు 15 వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఐబీ తెలంగాణ పోలీసులను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు (Telangana police) అప్రమత్తమయ్యారు. లష్కరే తాయిబా (Lashkar-e-Taiba), జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) వంటి ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది. దేశ రాజధాని పాటు కీలక నగరాలను పాకిస్థాన్ (Pakistan) ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేసే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు (Central Intelligence Agency) హెచ్చరించాయి.

దీంతో హైదరాబాద్‌ (Hyderabad)లోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport), రైల్వేస్టేషన్లు, బస్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘాను ముమ్మరం చేశారు. అటు శంషాబాద్ విమానాశ్రయంలో ఈ నెల 30 వరకు హైఅలర్ట్ కొనసాగిస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి.

ప్రేమించకపోతే ఇలా కక్ష తీర్చుకుంటారా.. యువతి లవ్ చేయడం లేదనే కోపంతో ఆమెను ఇష్టం వచ్చినట్లుగా కత్తితో పొడిచిన ప్రేమోన్మాది, నల్గొండ జిల్లాలో దారుణం

దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు ఇప్పటికే హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ అధికారుల హెచ్చరికలతో 10వేలమందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగే ఎర్రకోట చుట్టూ ఉన్న ఎత్తయిన భవనాలపై షూటర్లను మోహరించడంతో పాటు నో ఫ్లయింగ్ జోన్లు అమలు చేస్తున్నారు. గాలి పటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగురవేయకుండా నిషేధం విధించగా.. నగరవ్యాప్తంగా వెయ్యికిపైగా అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి

భద్రతను పర్యవేక్షిస్తున్నారు.