Telangana: రేపు సాయంత్రం 5 గంటల్లోపు డ్యూటీలో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొల‌గిస్తాం, జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు

మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌ల లోపు విధుల్లో చేరాల‌ని జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల‌కు ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసింది

TSPSC

Hyd, May 8: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు చేప‌ట్టిన స‌మ్మెపై ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌ల లోపు విధుల్లో చేరాల‌ని జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల‌కు ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసింది. విధుల్లో చేర‌క‌పోతే ఉద్యోగాల్లో నుంచి తొల‌గిస్తామ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు పంచాయ‌తీరాజ్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సందీప్ సుల్తానియా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

నేడు అల్ప పీడనం, బంగాళాఖాతం వైపు కదులుతూ తుపానుగా బలపడనున్న వాయుగుండం, ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌‌తో సమ్మెకు దిగారు. ఈ క్రమంలో రెగ్యులర్ చేసే దాకా సమ్మె ఆపేది లేదని సెక్రటరీలు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు.

జూనియర్‌ సెక్రటరీలకు రాజకీయ పార్టీలు, నేతల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ వారికి మద్దతు ప్రకటించారు. జేపీఎస్‌‌లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్ల నుంచి గ్రామాలకు అవార్డులు రావటంలో కీలక పాత్ర పోషించారని, వారిది న్యాయమైన డిమాండ్ అని అన్నారు.



సంబంధిత వార్తలు