ఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు అల్ప పీడనం ఏర్పడనున్నట్టు భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో రేపు అది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత ఉత్తర దిశగా పయనిస్తూ బంగాళాఖాతం వైపు కదులుతూ తుపానుగా బలపడుతుందని పేర్కొన్నారు. రాబోయే రెండు రోజుల్లో మోచా తుఫాను మార్గం స్పష్టంగా ఉంటుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.
500 సంవత్సరాల క్రితం ప్రపంచానికి కాఫీని పరిచయం చేసిన ఎర్ర సముద్రపు ఓడరేవు నగరం పేరు మీదుగా యెమెన్ దేశం మోచా(Cyclone Mocha) అని ఈ తుపానుకు పెట్టారు.తుపాను ఆగ్నేయ బంగాళాఖాతం,దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతోందని కోల్‌కతా డిప్యూటీ డైరెక్టర్ సంజీబ్ బెనర్జీ చెప్పారు. దీని ప్రభావం వల్ల మే 8వతేదీన అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ తుపాను వేగం, దిశ, తీవ్రత, అది ప్రయాణించే మార్గంపై రేపటికి స్పష్టత వస్తుందన్నారు. తుపాను కనుక ఉత్తర దిశగా కదిలితే ఇక్కడి తేమంతా అటువైపు వెళ్లి తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, పశ్చిమ దిశగా వెళ్తే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. అలాగే, నేడు కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణపై మోచి తుఫాన్ ఎఫెక్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, ఏయే జిల్లాల్లో భారీ వర్షాలంటే?
అల్పపీడన ప్రాంతం ఏర్పడిన తర్వాత దాని మార్గం, తీవ్రత వివరాలు అందించబడతాయి. సిస్టమ్ నిరంతరం పర్యవేక్షించబడుతోంది. క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుందని IMD తెలిపింది.తుపాను నేపథ్యంలో ఒడిశాలోని 18 జిల్లాల్లో ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రాంతీయ వాతావరణ శాఖ, భువనేశ్వర్, రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలను ఎల్లో అలర్ట్‌లో ఉంచింది మరియు ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రపాడ, కటక్ మరియు పూరితో సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం నుంచి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులను హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఉన్నవారు మే 7 లోపు సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని, మధ్య బంగాళాఖాతం మీదుగా ఉన్నవారు మే 9 లోపు తిరిగి రావాలని సూచించబడింది” అని వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడన వ్యవస్థ ఏర్పడి తుఫానుగా మారే అవకాశం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాతో సహా ప్రాంతం అంతటా ఉన్న తీర ప్రాంతాలకు ఆందోళన కలిగిస్తుంది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించాలని IMD ప్రజలను కోరింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం వల్ల మే 8 నుంచి మే 12వతేదీ వరకు ఐదు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం వెల్లడించింది.(IMD issues heavy rain alert)మోచా తుపాన్ వల్ల అండమాన్, నికోబార్ దీవుల్లో(Andaman and Nicobar Islands) భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది.ఈ వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు.