Crop Loan Waiver Guidelines: రైతు కుటుంబం గుర్తింపుకు రేషన్ కార్డు తప్పనిసరి, ఈ పిరియడ్‌లో తీసుకున్న వారికే రూ. 2 లక్షల రుణమాఫీ, పంట రుణమాఫీపై గైడ్ లైన్స్ ఇవిగో..
ఈ క్రమంలో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వెల్లడించింది.
Hyd, July 15: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ (Loan Waiver) చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వెల్లడించింది.
2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13వ తేదీ వరకు తీసుకున్న పంట రుణాలపై ఇది వర్తిస్తుందని వెల్లడించింది. స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తోందని షరతు విధించారు. రాష్ట్రంలో గల షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. రైతు కుటుంబం గుర్తింపుకు రేషన్ కార్డు ప్రామాణికమని వెల్లడించింది. డీఎస్సీ యధాతథంగా నిర్వహిస్తాం, నిరుద్యోగుల నిరసనలపై కీలక ప్రకటన చేసిన డిప్యూటీ సీఎం భట్టి
పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణఖాతాల్లోనే జమ కానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును విడుదల చేస్తారు. ఎస్‌హెచ్‌జీ, జేఎల్జీ, ఆర్ఎంజీ, ఎల్ఈసీఎస్ రుణాలకు, రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదు. రుణమాఫీపై రైతుల సందేహాలను తీర్చడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. రైతు సమస్యలు ఉంటే 30 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలకు వెబ్ పోర్టల్ చూడవచ్చు... లేదా మండల సహాయ కేంద్రాలను సంప్రదించాలి.
వ్యవసాయశాఖ కమిషనర్, సంచాలకులు (డీఓఏ) పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేస్తారు. హైదరాబాద్‌లో గల నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎస్ఐఐసీ) ఈ పథకానికి భాగస్వామిగా ఉంటుంది. వ్యవసాయశాఖ సంచాలకులు, ఎస్బీఐ కలిసి ఐటి పోర్టల్ నిర్వహిస్తారు. ఆ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది. ఐటి పోర్టల్ ఆర్థికశాఖ నిర్వహించే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌కి బిల్లులు సమర్పించడం, పథకానికి సంబంధించిన భాగస్వాములతో సమాచారం పంచుకోవడం, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకమైన మాడ్యూల్స్ ఉంటాయి. హైదరాబాద్ లోని అశోక్ నగర్ చౌరస్తాలో కొనసాగుతున్న నిరుద్యోగులు మెరుపు ధర్నా (వీడియో)
పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా (బీఎస్) నియమిస్తారు. బ్యాంకు నోడల్ అధికారి బ్యాంకులకు వ్యవసాయశాఖ సంచాలకులు, ఎస్ఐసీ మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. బ్యాంక్ నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంక్ యొక్క పంట రుణాల డేటాను డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది.
అంతకుముందు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... అగస్ట్‌లోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రైతుబంధు లేదా రైతు భరోసాకు సంబంధించి ఏడు వేల కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.