IPS Transfers in Telanagana: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు, కొత్త పోస్టుకు స్టీఫెన్ రవీంద్ర, త్వరలోనే ఐఏఎస్‌ల ట్రాన్స్ ఫర్లు కూడా..
యాంటి నార్కోటిక్ బ్యూరో ఏడీజీగా సీవీ ఆనంద్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా సందీప్ శాండిల్య, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా స్టీఫెన్ రవీంద్ర , హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్, అడిషనల్ డీజీ ఆర్గనైజేషన్ లీగల్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, రైల్వే అండ్ రోడ్డు సేఫ్టీ అడిషనల్ డీజీగా శివధర్ రెడ్డిని నియమించారు.
Hyderabad, JAN 04: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ (IPS transfers) అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 29 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తుర్వులు జారీ చేసింది. పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీగా రాజీవ్ రతన్ (rajeev ratan), యాంటి నార్కోటిక్ బ్యూరో ఏడీజీగా సీవీ ఆనంద్ (CV anand), పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా సందీప్ శాండిల్య, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా స్టీఫెన్ రవీంద్ర (Stifen ravindra), హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్, అడిషనల్ డీజీ ఆర్గనైజేషన్ లీగల్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, రైల్వే అండ్ రోడ్డు సేఫ్టీ అడిషనల్ డీజీగా శివధర్ రెడ్డిని నియమించారు. పోలీస్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ ఏడీసీబీగా అభిలాష్, షీ టీమ్ అడిషనల్ డీజీగా శిఖా గోయల్, టీఎస్ఎస్సీ బెటాలియన్ అడిసనల్ డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అడిషనల్ డీజీగా విజయ్ కుమార్, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీగా నాగిరెడ్డి, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ గా సుధీర్ బాబు, మల్టీ జోన్-2 ఐజీగా షానవాజ్, శిక్షణా విభాగం ఐజీగా తరుణ్ జోషికి బాధ్యతలు అప్పగించారు.
అలాగే ఐజీ పర్సనల్ గా కమలాసన్ రెడ్డి, మల్టీ జోన్-1 ఐజీగా చంద్రశేఖర్ రెడ్డి, ప్రొవిజనల్, లాజిస్టిక్స్ డిప్యూటీ ఐజీగా రమేశ్, ఇంటెలిజెన్స్ డిప్యూటీ ఐజీగా కార్తికేయ, రాజన్న జోన్ డిప్యూటీ ఐజీగా రమేశ్ నాయుడు, కార్ జాయింట్ కమిషనర్ శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఐజీగా ఇక్బాల్, రాచకొండ జాయింట్ కమిషనర్ గా గజరావ్ భూపాల్ నియమితులయ్యారు.
అలాగే యాదాద్రి డీఐజీగా రెమారాజేశ్వరి, జోగులాంబ జోన్ డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా నారాయణ్ నాయక్, హైదరాబాద్ జాయింట్ కమిషనర్ అడ్మిన్ గా పరిమళ హనా నూతన్, సీఐ సెల్ ఇంటెలిజెన్స్ ఎస్ పీగా భాస్కరన్, పోలీస్ కంప్యూటర్స్ సర్వీసెస్ అడిషనల్ గా డీజీగా వి.వి. శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు. నేడో, రేపో ఐఏఎస్ ల బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం రంగం చేసింది.