Telangana: తెలంగాణలో సీబీఐకి నో ఎంట్రీ, ఇంతకీ ఆ జీవో 51లో ఏముంది, రెండు నెలల క్రితమే జారీ చేస్తే ఇప్పుడు ఎందుకు బయటకు తీశారు, జనరల్ కన్సెంట్ ఉపసంహరణపై ప్రత్యేక కథనం

రాష్ట్రంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐకి గతంలో ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను (general consent) ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన సమ్మతిని ఉపసంహరించుకుంటూ జీవో 51ను ఆగస్టు 30న జారీ చేసింది.

IMAGE FROM CMO TELENGANA

Hyd, Oct 31: రాష్ట్రంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐకి గతంలో ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను (general consent) ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన సమ్మతిని ఉపసంహరించుకుంటూ జీవో 51ను ఆగస్టు 30న జారీ చేసింది.

ఈ జీవో ప్రకారం ఎలాంటి నేరాల విషయంలోనైనా తెలంగా­ణలో దర్యాప్తు చేసేందుకు ప్రతి కేసుకు రాష్ట్ర ప్ర­భు­త్వం (Telangana govt) నుంచి ముందస్తుగా సమ్మతి తీసు­కోవాల్సి ఉంటుందని అందులో స్పష్టం చేసింది. కాగా ‘ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల కేసు­లో సీబీఐ విచారణ జరపాలన్న బీజేపీ విజ్ఞప్తిౖ­పె హైకోర్టు విచారణ నేపథ్యంలో ఈ జీవో బహిర్గతం కావడం గమనార్హం.

విపక్షాల నేతలు లక్ష్యంగా సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాడులు చేయిస్తోందనే ఆరోపణల నేపథ్యంలో..ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌–1946’కి సంబంధించిన సభ్యులందరికీ గతంలో జారీ చేసిన సాధారణ సమ్మతిని ఉప సంహరించుకుంటూ రాష్ట్ర హోంశాఖ ఆగస్టు 30న రహస్యంగా జీవో 51 జారీ చేసింది.

మునుగోడు సభలో గర్జించిన కేసీఆర్, వందకోట్లతో కొనాలని చూస్తే, ఎడమకాలి చెప్పుతో కొట్టారు మా ఎమ్మెల్యేలు, మోదీ ఎందుకు ఇంత కిరాతకం.

ఈ చట్టం కిందే సీబీఐ ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణలో సీబీఐకి ప్రవేశాన్ని నిరాకరించినట్టు అయింది. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులపై దర్యాప్తు చేసే అధికారాన్ని సైతం సీబీఐ కోల్పోయినట్టే. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలు/సంస్థల ఉద్యోగులపై దర్యాప్తు విషయంలో సీబీఐ పాత్రను రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పోషించాల్సి ఉండనుంది.

నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు భారీగా డబ్బు, పదవులు ఇస్తామని ఎర వేసి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురిని ఇటీవల సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ముగ్గురి వెనక బీజేపీ పెద్దలున్నట్టు టీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేయగా.. అదంతా టీఆర్‌ఎస్‌ కుట్ర అని బీజేపీ ప్రత్యారోపణలు చేసింది.ఈ క్రమంలో కేసు దర్యాప్తును సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్‌కు అప్పగించాలంటూ బీజేపీ వేసిన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు శనివారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటూ జీవో నం.51 జారీ చేశామని.. సీబీఐ ప్రవేశానికి అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. దీనితో రెండు నెలల కింద రహస్యంగా జారీ అయిన జీవో తాజాగా బహిర్గతమైంది.

కేంద్రం ఢిల్లీ స్పెషల్‌ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం–1946 కింద సీబీఐని ఏర్పాటు చేసింది. సీబీఐ ఢిల్లీ భూభాగం పరిధిలో తమ అధికారాలను వినియోగించుకోవడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. సీబీఐ ఇతర రాష్ట్రాల్లో తమ అధికారాలను అమలు చేసి దాడులు, దర్యాప్తు చేపట్టాలంటే.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ భూభాగంలో సీబీఐకి అనుమతిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయాలి.

అవినీతి నిరోధక చట్టం–1998, ఐపీసీలోని కొన్ని సెక్షన్లతోపాటు 63కి పైగా కేంద్ర ప్రభుత్వ చట్టాల్లోని సెక్షన్ల కింద సీబీఐ ఆయా రాష్ట్రాల భూభాగంలో నేరాలపై దర్యాప్తు చేసేందుకు సాధారణ సమ్మతి అవసరం. ఈ సాధారణ సమ్మతిని వెనక్కి తీసుకునే అధికారాన్ని సైతం రాష్ట్రాలకు ఉంటుంది. చివరిసారిగా తెలంగాణ ప్రభుత్వం 2016లో సెప్టెంబర్‌ 23న సీబీఐకి సాధారణ సమ్మతి నోటిఫికేషన్‌ను జారీ చేస్తూ జీవో 160 జారీ చేసింది.

ప్రస్తుతం ఆ జీవోతో పాటు గతంలో జారీ చేసిన అన్ని సాధారణ సమ్మతులను ఉపసంహరించుకుంటున్నట్టు జీవో 51లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే దేశంలో 8 రాష్ట్రాలు సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోగా.. తెలంగాణ 9వ రాష్ట్రంగా మారింది.

ఇదిలా ఉంటే సీబీఐ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. తప్పు చేయకుంటే ఎందుకంత భయం, తప్పు చేయకుంటే విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారు? అని సంజయ్ ప్రశ్నించారు. సీబీఐ విషయంలో ఆగస్టు 30న జీవో 51 ఇచ్చారని చెబుతున్నారని, బీజేపీ పిటీషన్ వేసేంత వరకూ జీవో అంశం బయటికి రాలేదన్నారు. లిక్కర్ కేసు రాగానే జీవో 51 ఇచ్చారంటూ బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ కు ఏ సంస్థపైనా నమ్మకం లేదు. ఇకనైనా కేసీఆర్ తప్పుడు ఆరోపణలు మానుకోవాలి అని సంజయ్ అన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Swarna Vimana Gopuram Maha Kumbhabishekam: మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, స్వర్ణ విమాన గోపురం మహాకుంభాభిషేకానికి రావాల్సిందిగా ఆహ్వానం

Kamareddy: ఉదయం కూతురు పెళ్లి...సాయంత్రం తండ్రి అంత్యక్రియలు, కూతురు పెళ్లి జరుగుతుండగానే కుప్పకూలిన తండ్రి, ఆస్పత్రికి తరలించే లోపే మృతి

Hindi Row: బలవంతంగా హిందీ భాషను ఎవరిపైనా రుద్దే ప్రసక్తే లేదు, సీఎం స్టాలిన్ లేఖకు స్పందించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

Vizag Astrologer Murder Case: విశాఖపట్నం జ్యోతిష్యుడు హత్య కేసులో షాకింగ్ విషయాలు, పూజలు చేస్తానంటూ ఇంటికి వెళ్లి మహిళపై అత్యాచారం, అందుకే దారుణంగా హత్య చేసిన భార్యాభర్తలు

Share Now