Telangana Group 2 Postponed: తెలంగాణ గ్రూప్ 2 వాయిదా, డిసెంబర్‌లో పరీక్ష, త్వరలో తేదీలు ఖరారు

ఆగస్టులో నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రభుత్వం వెల్లడించింది. కొంతకాలంగా డీఎస్సీ కారణంగా గ్రూప్ 2 వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

telangana gropu 2 postponed.jpg

Hyd, July 16:  తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. ఆగస్టులో నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రభుత్వం వెల్లడించింది. కొంతకాలంగా డీఎస్సీ కారణంగా గ్రూప్ 2 వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రూప్ 2ను వాయిదా వేసింది ప్రభుత్వం.

2022లో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ జారీ చేసింది టీఎస్‌పీఎస్సీ(ప్రస్తుతం టీజీపీఎస్సీ). అయితే వివిధ కారణాలతో గ్రూప్ 2 పరీక్ష మూడు సార్లు వాయిదా పడింది. ఇక తాజాగా ఈ ఏడాది ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ తాజాగా నాలుగోసారి వాయిదా పడింది.

18 విభాగాల్లో 783 పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ, గ్రూప్‌-2 పరీక్షలకు మధ్య చాలా తక్కువ వ్యవధి ఉందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులతో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సమావేశం అయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయి సమస్యను వివరించగా గ్రూప్ 2 వాయిదా వేశారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉంది.  అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన,ప్రవాస భారతీయులతో భేటీ

టీఎజీ డీఎస్సీ, గ్రూప్‌-2 పరీక్షలను మే, జూన్‌లో నిర్వహించాల్సి ఉండగా అభ్యర్థుల డిమాండ్‌ మేరకు.. డీఎస్సీ కంటే ముందు టెట్‌ నిర్వహించామని బల్మూరి వెంకట్‌ తెలిపారు. అప్పటికే టీజీపీఎస్సీ పరీక్షలకు తేదీలు ఇవ్వడంతో ఇప్పుడు డీఎస్సీ, గ్రూప్‌-2 పరీక్షలు వారం వ్యవధిలోనే వచ్చాయని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వివరించారు. ఈ విషయంలో నిరుద్యోగులది న్యాయమైన డిమాండే కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి గ్రూప్‌-2 వాయిదా వేసేలా కృషి చేస్తామని హామీఇచ్చారు. ఇదే క్రమంలో త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.