Group 1 Prelims Exam Cancelled: గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు షాక్, గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ ర‌ద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కీలక తీర్పు

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ర‌ద్దు చేసి మ‌ళ్లి నిర్వ‌హించాల‌న్న పిటిష‌న్‌పై విచార‌ణ చేప్ప‌ట్టిన టీఎస్ హైకోర్టు.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసింది. జూన్ 11వ తేదీన జ‌రిగిన ఈ ప‌రీక్ష ర‌ద్దు చేసి మ‌ళ్లి నిర్వ‌హించాల‌ని TSPSCని కోర్టు ఆదేశించింది.

High Court of Telangana | (Photo-ANI)

Hyd, Sep 23: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ర‌ద్దు చేసి మ‌ళ్లి నిర్వ‌హించాల‌న్న పిటిష‌న్‌పై విచార‌ణ చేప్ప‌ట్టిన టీఎస్ హైకోర్టు.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసింది. జూన్ 11వ తేదీన జ‌రిగిన ఈ ప‌రీక్ష ర‌ద్దు చేసి మ‌ళ్లి నిర్వ‌హించాల‌ని TSPSCని కోర్టు ఆదేశించింది.

కాగా తెలంగాణలో 503 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను నిర్వహించిన విష‌యం తెల్సిందే. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 పోస్టులకు మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైన విష‌యం తెల్సిందే. అక్టోబర్‌ 16న మొదటి పరీక్షలు నిర్వహించగా.. అప్పట్లో ప్రశ్నాపత్రాల లీకేజీ(TSPSC Paper Leak Case) వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ పరిణామాలతో గ్రూప్‌-1తో పాటు ఇతర పరీక్షలను రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ.. మళ్లీ నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్‌ 11న గ్రూప్-1 పరీక్షను మరోసారి నిర్వహించింది. ఈ 503 పోస్టుల భర్తీకి గానూ.. మొత్తం 3 లక్షల 80 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. 2 లక్షల 32 వేల 457 మంది అభ్యర్థులు రెండోసారి పరీక్షకు హాజరయ్యారు.ఇప్పుడు ఇది రెండవ సారి రద్దు చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది.

25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, 470 బస్సులు వచ్చే ఆరునెలల్లో నడుపుతామని తెలిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

రెండోసారి నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షా సమయంలో బయోమెట్రిక్ తీసుకోకపోవటం, ఓఎంఆర్‌ షీట్‌పై హాల్‌ టికెట్‌ నంబర్‌, ఫొటో లేదంటూ పలువురు అభ్యర్థులు జూన్‌లోనే హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో అనుమానాలు రేకెత్తుతున్న వేళ.. కీలకమైన అంశాలను టీఎస్‌పీఎస్సీ విస్మరించిందంటూ కోర్టుకు వివరించారు. ఇదే అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. తొలిసారి పరీక్షలో పాటించిన విధానాలను రెండోసారి ఎందుకు పాటించలేదని కమిషన్‌ను ప్రశ్నించింది.

బయోమెట్రిక్‌, ఓఎంఆర్‌పై ఫొటోకు రూ.కోటిన్నర ఖర్చవుతుందంటూ టీఎస్‌పీఎస్సీ తరఫున న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ వచ్చారు. పరీక్షలో ఎలాంటి అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని.. ఆధార్‌, పాన్‌ వంటి గుర్తింపు కార్డులతో ఇన్విజిలేటర్లు అభ్యర్థులను ధ్రువీకరించుకున్నాకే పరీక్ష నిర్వహించామని కోర్టుకు వెల్లడించింది. పరీక్ష నిర్వహణ అంశంలో ఖర్చులు ముఖ్యం కాదని, పారదర్శకతే ప్రధానమని పేర్కొన్న కోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని విచారణ వేళ టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. కీలక తీర్పును వెలువరించింది. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి.. మరోసారి నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం, పరీక్షల రద్దు, వాయిదా పరిణామాల వల్ల ఇప్పటికే అభ్యర్థులు చాలా నష్టపోయారని భావిస్తోన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

KTR On Rythu Bharosa: రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్

Road Accidents in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు.. రెండు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం.. నల్గొండ జిల్లా దేవరకొండలో ముగ్గురు.. స‌త్య‌సాయి జిల్లాలో నలుగురు మృతి

New Model Kia Syros Car: మార్కెట్లోకి కియా మ‌రో కొత్త కారు, అదిరిపోయే ఫీచ‌ర్ల‌కు, ఆక‌ట్టుకునే ధ‌ర‌తో తీసుకొస్తున్న కియా

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif