Teachers Transfers Row: ఉపాధ్యాయుల బదిలీలపై మార్చి 14 వరకు స్టే ఇచ్చిన తెలంగాణ హైకోర్టు, కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు

ఉపాధ్యాయుల బదిలీలపై నెల పాటు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బదిలీల నిబంధనలపై నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ పిటిషన్‌ వేయగా.. హైకోర్టు విచారణకు స్వీకరించింది.

High Court of Telangana | (Photo-ANI)

Hyd, Feb 14: తెలంగాణ ప్రభుత్వానికి ..హైకోర్టు (Telangana high court) మంగళవారం ఝలక్‌ ఇచ్చింది. ఉపాధ్యాయుల బదిలీలపై నెల పాటు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బదిలీల నిబంధనలపై నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ పిటిషన్‌ వేయగా.. హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే.. టీచర్ల బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్లు వాదించారు.

ప్రభుత్వ ఉద్యోగ దంపతులు, గుర్తింపు యూనియన్ నేతలకు అదనపు పాయింట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మార్చి 14 వరకు బదిలీలపై స్టే (issues stay on government teachers transfers) విధించిన హైకోర్టు.. కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి మరో ముహూర్తం ఖరారు.. అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14న ప్రారంభం!

కాగా తెలంగాణలో నాలుగేళ్ల తర్వాత టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు నిబంధనలు విధించింది. రెండేళ్ల సర్వీస్ పూర్తైన వాళ్లే బదిలీ కోసం అప్లై చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో 317 జీవోతో ఇతర జిల్లాలకు బదిలీల అయిన ఉపాధ్యాయులు ఇప్పుడు ఆందోళన బాటపట్టారు.

తామంతా ఇతర ప్రాంతాలకు వెళ్లి కేవలం ఒక సంవత్సరమే అయిందని, ప్రస్తుత బదిలీల్లో తమకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల్లో మార్పు చేసి తమకు కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో కొంత మంది టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు.

మహాశివరాత్రి కోసం తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులు, ఏపీ సహా తెలంగాణలోని పలు శైవక్షేత్రాలకు 2,427 బస్సులు నడిపిస్తున్నట్లు ప్రకటన, స్పెషల్ బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం కూడా...

తెలంగాణ రాష్ట్రంలో 2015 జులైలో టీటర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. మరోసారి 2018లో రాష్ట్ర సర్కారు టీచర్ల బదిలీలు చేసింది. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. అయితే పదవీ విరమణకు ఇంకా మూడేళ్ల సర్వీస్‌ మాత్రమే ఉన్నవారిని ఈసారి బదిలీ చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రెండేళ్ల సర్వీస్‌ ఉన్నవారికి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది.



సంబంధిత వార్తలు