IPL Auction 2025 Live

Telangana High Court on Dogs Bite: కుక్కల దాడి ఘటనపై హైకోర్టు సీరియస్..ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వానికి ప్రశ్న?

నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వేర్వురుగా జరిగిన ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.

Telangana HighCourt On Dogs Bite(Twitter)

Hyd, july 16:  తెలంగాణలో వీధి కుక్కల దాడులు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వేర్వురుగా జరిగిన ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇందులో చిన్నారులు కూడా ఉండటం అందరిని కలిచివేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో పిల్ దాఖలు కాగా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ప్రశ్నించింది న్యాయస్థానం.

జవహర్‌నగర్‌లో కుక్కల దాడిలో సంవత్సరంన్నర బాలుడు మృతిచెందగా ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది న్యాయస్థానం. కుక్కల దాడిని పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. వీధి కుక్కల నుండి పిల్లలను కాపాడేందుకు పరిష్కార మార్గాలు అన్వేషించాలని సూచించింది. ఇక తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసిన ధర్మాసంన.... వచ్చే వాయిదాలో పరిష్కార మార్గాలతో రావాలని ఆదేశించింది. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్?, ట్రాఫిక్ ఎస్సై భాషపై కేటీఆర్ ట్వీట్, బదిలీ చేసిన ఉన్నతాధికారులు

ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని..కుక్కల దాడి ఘటనలు నివారించేందుకు స్టేట్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు అడ్వకేట్ జనరల్.కుక్కలను షెల్టర్ హోమ్స్‌కు తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలపగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యి పరిష్కారం చూపాలని న్యాయస్థానం తెలిపింది.



సంబంధిత వార్తలు

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి