KTR Asks DGP(Video Grab)

Hyd, July 16:  ఓ ట్రాఫిక్ ఎస్సై అత్యుత్సాహం, అతడి భాష విధుల నుండి బదిలీ అయ్యేలా చేసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ ఆలయ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు ఓ లారి డ్రైవర్‌పై చేయి చేసుకోవడమే కాదు ఇష్టం వచ్చినట్లుగా దుర్బాషలాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ పోలీసుల వ్యవహార శైలీని ప్రశ్నించారు. వినరాని భాషలో సాధారణ పౌరుడిని పోలీస్ సిబ్బంది దుర్భాషలాడటం బాధాకరమన్నారు. . పోలీసులు, ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలన్నారు.  దారుణం, తల్లి,పెళ్ళాం అంటూ అసభ్యపదజాలంతో లారీ డ్రైవర్ మీద రెచ్చిపోయిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఈమధ్యకాలంలో ప్రజలతో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు సరిగా ఉండటం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు కేటీఆర్. ప్రజలతో పోలీసులు వ్యవహరించే తీరు మారాలని అవసరమైతే శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని సూచించారు.

Here's Tweet:

ఇక ఇదే అంశాన్ని పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు పలువురు డ్రైవర్లు. లారీ డ్రైవర్ పై దుర్భాషలాడిన ట్రాఫిక్ పోలీస్ పై బదిలీ వేటు వేశారు. బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తోసుకొని.. అతడిని ఆ స్టేషన్ నుంచి బదిలీ చేశారు.