Telangana Horror: దారుణం, కూతురు మానసిక స్థితి సరిగా లేదని గొంతుకు నూలు దారం బిగించి హత్య చేసిన తల్లిదండ్రులు, చేతబడి చేశారని నమ్మించే ప్రయత్నం..
మానసిక స్థితి సరిగా లేదని కన్న కూతురిని చంపేశారు తల్లిదండ్రులు.. మృతురాలికి 13 నెలల కుమారుడు ఉన్నాడు.
Hyd, May 20: రాజన్న సిరిసిల్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానసిక స్థితి సరిగా లేదని కన్న కూతురిని చంపేశారు తల్లిదండ్రులు.. మృతురాలికి 13 నెలల కుమారుడు ఉన్నాడు. వివరాల్లోకెళితే..తంగళ్లపల్లి మండలం నేరెల్ల గ్రామానికి చెందిన చెప్యాల నర్సయ్య- ఎల్లవ్వ దంపతుల పెద్ద కూతురు ప్రియాంక(25) గత ఏడు సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధ పడుతుండడంతో చాలా ఆసుపత్రులు, దేవాలయాల వద్దకు తీసుకెళ్లారు. కొంతవరకు వ్యాధి నయం కావడంతో 2020లో ప్రియాంకకు వివాహం చేయగా తనకు 13 నెలల కుమారుడు ఉన్నాడు.
మళ్ళీ నెల రోజులుగా ప్రియాంక మానసిక వ్యాధితో బాధపడుతూ అందరిని ఇబ్బంది పెడుతూ, చుట్టుపక్కల వారిని దూషించడం, గొడవలు పెట్టుకోవడంతో భర్త ఆమె తల్లిదండ్రులకు తెలియజేశాడు.వారు బుగ్గరాజేశ్వరస్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ మూడు రోజులు ఉంచి నయం కాకపోవడంతోపాటు విసిగిపోయిన తల్లిదండ్రులు 14న రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నూలు దారం గొంతుకు బిగించి హత్య చేశారు. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, 8 మందికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
ప్రియాంక అత్తగారికి చేతబడి వల్ల మరణించిందని చెప్పి నమ్మించి అంత్యక్రియలు నిర్వహించారు.. అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా తల్లిదండ్రులే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు.