Telangana Shocker: సంగారెడ్డి జిల్లాలో దారుణం, భార్యను గొడ్డలితో నరికి అనంతరం ఉరి వేసుకున్న భర్త, మరో ఘటనలో రంగారెడ్డి జిల్లాలో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
కుటుంబ వివాదాలతో ఓ భర్త తన భార్యను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. అనంతరం అతను కూడా ఉరేసుకుని ఆత్మహత్య (committed suicide) చేసుకున్నాడు.
Hyd, Mar 20: తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆందోల్ మండలంలోని నాదులాపూర్ గ్రామంలో దారుణ ఘటన (Telangana Shocker) చోటు చేసుకుంది. కుటుంబ వివాదాలతో ఓ భర్త తన భార్యను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. అనంతరం అతను కూడా ఉరేసుకుని ఆత్మహత్య (committed suicide) చేసుకున్నాడు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి పోలీసులు చేసుకున్నారు.మృతులను నారాయణ, మల్లమ్మగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమాట్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ వివాదాల వల్లే నారాయణ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇక రంగారెడ్డి జిల్లాలో క్షణికావేశంలో ఓ భర్త( Husband ) తన భార్య( Wife )ను గొడ్డలితో నరికి చంపాడు. నెలన్నర పసికందు( Child )ను నీటి సంపులో పడేశాడు. ఈ దారుణ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని అనాజ్‌పూర్‌లో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.అనాజ్‌పూర్( Anazpur ) గ్రామానికి చెందిన ఏర్పుల ధన్‌రాజ్‌కు లావణ్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చింది.
ఇంట్లోకి వెళ్లిన కాసేపటికే లావణ్యపై ధన్‌రాజ్ గొడ్డలితో దాడి చేశాడు. మెడకు తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తల్లిపై గొడ్డలితో దాడి చేయడాన్ని చూసిన ఆద్య.. భయపడి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. నెలన్నర పసికందును నీటి సంపులో పడేశాడు.
ఇక భార్య, కుమారుడిని చంపిన ధన్‌రాజ్ అందరూ చూస్తుండగానే, రక్తపు మరకలు అంటిన బట్టలతోనే పరారైయ్యాడు. స్థానికులు అందించిన సమాచారంతో వనస్థలిపురం( Vanasthalipuram ) ఏసీపీ పురుషోత్తం ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ధన్ రాజ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.