Lockdown in Telangana: లాక్‌డౌన్ దెబ్బ..నిన్న ఒక్క రోజే రూ. 219 కోట్ల మద్యం అమ్మకం, 4 గంటల వ్యవధిలో తెలంగాణలో 94 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు, తెలంగాణలో ఉన్న మొత్తం 2,200 మద్యం దుకాణాల్లో పుల్ రష్

దీంతో నిన్న ఒక్క రోజే ఏకంగా 125 కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని (Liquor stores sell out within hours) కొనుగోలు చేశారు.

Long Queue Outside Liquor Shop (Photo Credits: Twitter/@Yatharth9815)

Hyderabad, May 12: ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ (Lockdown in Telangana) అని ప్రకటించగానే మందుబాబులు క్యూ కట్టిన విషయం విదితమే. దీంతో నిన్న ఒక్క రోజే ఏకంగా 125 కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని (Liquor stores sell out within hours) కొనుగోలు చేశారు. నేటి నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి రాగా.. ఉదయం 6-10 గంటల వరకే అన్ని కార్యకలపాలకు అనుమతిచ్చారు. ఇక ఇవాళ ఒక్కరోజు అది కూడా 4 గంటల వ్యవధిలో తెలంగాణలో 94 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి.

ఈనెల 1 నుంచి 12 వరకు అన్ని డిపోలలో 770 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగ్గా.. కేవలం నిన్న, ఈ రోజు(మే 11,12) ఏకంగా 219 కోట్ల రూపాయల అమ్మకాలు జరగడం గమనార్హం. ఇక తెలంగాణలో మొత్తం 2,200 మద్యం దుకాణాలు ఉన్నాయి. కాగా గతేడాది అనుభవం దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా మద్యం కొనుగోలుకు ఎగబడ్డారు. ఏ మద్యం దుకాణం చూసినా కూడా మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు కిటకిటలాడాయి.

వైన్‌ షాపుల ఎదుట నో స్టాక్ బోర్డులు, మద్యం షాపులకు పోటెత్తిన మద్యం ప్రియులు, రేపటి నుండి లాక్‌డౌన్ ప్రకటనతో పది రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేస్తున్న మందుబాబులు

కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర క్యూలైన్‌ కొనసాగాయి. మద్యం దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటలకు తెరచి ఉంటుందని తెలిసినా కూడా మందు కోసం ఎగబడ్డారు. సంపన్నులతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలు కూడా తమ స్థాయికి మించి మద్యం కొనుగోళ్లు చేశారు. కొందరు తమ వద్ద డబ్బు లేకున్నా అప్పు చేసి మరి మద్యం తీసుకెళ్లారు. ఈ పది రోజులకు సరిపడా తీసుకెళ్లారు. మరికొందరేమో లాక్‌డౌన్‌ గడువు పెరుగుతుందని భావించి భారీగా కొనుగోలు చేశారు.

Here's Videos

మద్యం దుకాణాలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో నిర్వాహకులు, యజమానులు ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. ఉన్న అరకొర సిబ్బందితోనే విక్రయాలు కొనసాగించారు. మద్యంప్రియులు ఒక్కసారిగా ఎగబడడంతో మద్యం దుకాణాల్లో స్టాకంతా అయిపోయింది. నో స్టాక్‌ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సాధారణ మద్యం దుకాణం నుంచి వైన్స్‌ మార్ట్‌ వరకు ఇదే పరిస్థితి. ఒక వైన్స్‌ మార్ట్‌లో మద్యం సీసాలన్నీ ఖాళీ అవడంతో కబోర్డులన్నీ వెలవెలబోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.



సంబంధిత వార్తలు