Hyderabad, May 12: రేపటి నుంచి తెలంగాణలో 10 రోజుల పాటు లాక్‌డౌన్ (TS Lockdown) విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో (Lockdown Effect) రాజధానిలో మందుబాబులు అప్రమత్తం అయ్యారు. లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాల వేళలపై స్పష్టత లేకపోవడంతో ముందే జాగ్రత్తపడుతూ, వైన్ షాపులకు పోటెత్తారు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఏ వైన్ షాపు ముందు చూసినా మందుబాబుల రద్దీ (Long queues at alcohol shops) కనిపించింది.
హైదరాబాదులోని వైన్ షాపుల వద్ద భారీ క్యూలు దర్శనమిచ్చాయి. కొన్నిచోట్ల ఈ క్యూలు కిలోమీటర్ల మేర ఉన్నాయంటే మందుబాబుల ముందుజాగ్రత్త ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది కేసుల కొద్దీ మద్యం, బీర్లు కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. అయితే, మద్యం దుకాణాల వద్ద భౌతికదూరం నిబంధన అమలు కాకపోవడం ఆందోళన కలిగించే అంశం.మద్యం కోసం పలు వైన్‌షాపుల వద్ద తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి.
కొన్ని చోట్ల ఇప్పటికే వైన్ షాపులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. టోలిచౌకి, గోల్కొండ, లంగర్ హౌస్ తదితర ప్రాంతాల్లో లిక్కర్ షాపుల ముందు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా గుమికూడారు. కోవిడ్ రూల్స్ పాటించకుండా మద్యం కోసం ఎగబడుతున్నారు. ముందస్తుగానే మద్యం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొందరు పది రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేస్తున్నారు. కాగా, లాక్‌డౌన్ అమల్లోకి వస్తే మద్యం హోం డెలివరీకి అనుమతి ఇవ్వాల్సిందిగా లిక్కర్, బీర్ సప్లయర్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. లిక్కర్ ఉత్పత్తిని కూడా ఆపకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.
Here's Updates
People rush to wine shops for buying liquor in Hyderabad after government announced lockdown from tomorrow #Hyderabad #lockdowntelangana #liquorshop pic.twitter.com/kEmN26yjQ2
— 𝗥𝗮𝗳𝗶 𝗦𝘆𝗲𝗱 (@JournalistRafi) May 11, 2021
Heavy rush at wine shops in Hyderabad Bhoiguda Main Road #Hyderabad #lockdowntelangana pic.twitter.com/Qcxc082Rzk
— 𝗥𝗮𝗳𝗶 𝗦𝘆𝗲𝗱 (@JournalistRafi) May 11, 2021
People at @ wine shop - regular scene in Telugu states pic.twitter.com/bDwSAto2tE
— 𝗥𝗮𝗳𝗶 𝗦𝘆𝗲𝗱 (@JournalistRafi) May 11, 2021
కాగా కరోనా విజృంభిస్తున్నా పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా మందు దుకాణాల ఎదుట పోగవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దుకాణాల ఎదుట రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మాస్కు ధరించని వారిని వెనక్కు పంపుతున్నారు. భౌతికదూరం పాటించాలని మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వారికి సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే కర్ఫ్యూ రిలీఫ్ టైమ్‌లో మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఇవ్వనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మద్యం షాపులను మినహాయించుకుంటే.. ప్రభుత్వ ఖజానాకు భారీగా కోత పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.
రేపటి నుంచి పది రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశమిచ్చారు. మరోవైపు టీకా కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. తెలంగాణ హైకోర్టుతో సహా పలువురు లాక్‌డౌన్ విధించడమే సరైన మార్గమని చెబుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంది.