Hyderabad, May 11: లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ (10 days Lockdown in Telangana) విధించనున్నట్టు ప్రకటించింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ ( Impose 10-Day Complete Lockdown in Telangana) అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.
ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం ఉంటుందని క్యాబినెట్‌లో నిర్ణయించారు. మరోవైపు టీకా కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ లాక్ డౌన్ సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ రోజువారీ కార్యకలాపాలకు మినహాయించారు. ఆ తర్వాత పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ మేరకు మంగళవారం సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకుంది.
కోవిడ్ కట్టడి కోసం రాత్రి కర్ఫ్యూ విధించినప్పటికి మహమ్మారి అదుపులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుతో సహా పలు సంస్థలు లాక్‌డౌన్ విధించిడమే సరైన మార్గం అంటున్నాయి. తాజాగా కేబినెట్ 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
Here's TS CMO Tweet
మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం వుంటుందని నిర్ణయం తీసుకుంది. కోవిడ్ టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది
— Telangana CMO (@TelanganaCMO) May 11, 2021
రాష్ట్రంలో కేసులను పరిశీలిస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 62,923 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 4,826 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 2,345 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 5,02,187కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 723 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 324 కేసులు, రంగారెడ్డి నుంచి 302, నల్గొండ నుంచి 295 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.