Telangana Rains: వచ్చే మూడు రోజుల్లో.. తెలంగాణలో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు.. కొన్ని జిల్లాల్లో వడగళ్లు పడే అవకాశం.. 18 జిల్లాలకు యెల్లో అలర్ట్
తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని, ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
Hyderabad, March 14: వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో (Telangana) భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణశాఖ తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని, ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో వడగళ్లు పడే అవకాశం ఉందని వెల్లడించింది. 18 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు.
ఎప్పుడు ఏయే జిల్లాల్లో వర్షాలు?
బుధవారం రోజున
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్ నగర్
గురువారం రోజున
నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి
శుక్రవారం రోజున
నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల
మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోయాయి. సోమవారం నాడు 39 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా 39.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, మెదక్‌లలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.