Telangana Lockdown Update: కేసులు పెరిగితేనే తెలంగాణలో లాక్‌డౌన్, క్లారీటి ఇచ్చిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జనవరి చివరి వారంలో లాక్ డౌన్ ఉండే అవకాశం ఉందని తెలిపిన డీపీహెచ్
గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Hyd, Jan 3: తెలంగాణలో కరోనావైరస్ కేసులు, ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ (Telangana Lockdown Update) విషయంపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రంలో కేసుల తీవ్రత పెరిగితే లాక్ డౌన్ (Telangana Lockdown), కర్ఫ్యూ గురించి ఆలోచిస్తామన్నారు. జనవరి చివరి వారంలో లాక్ డౌన్ ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు. కరోనా మూడో దశ ప్రమాదం కాకపోయినా.. ప్రజలు అప్రమత్తంగా వుండాలన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి టీకాలు అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని శ్రీనివాసరావు ( State Health Director Srinivasa Rao ) చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18 లక్షల మంది అర్హులు ఉన్నట్లు వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు ముందుకు రావాలని డీహెచ్ శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. . కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 84 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. 3వేల 779 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ ఒమిక్రాన్ నుంచి 32 మంది కోలుకున్నారని వైద్యాధికారులు తెలిపారు. వైరస్ కట్టడికి ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని శ్రీనివాసరావు సూచించారు.