omicron (Photo-IANS)

New Delhi, Jan 3: దేశ రాజధాని దిల్లీలో ఒమిక్రాన్‌ వేవ్‌ మొదలైనట్లే కన్పిస్తోంది. గత రెండు రోజులుగా అక్కడ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అక్కడ కరోనా పాజిటివిటీ రేటు సోమవారం ఒక్కసారిగా 6.5కు చేరింది. పరీక్షలు చేసిన శాంపుల్స్‌లో 84 శాతం శాంపుల్స్‌లో ఒమైక్రాన్ వేరియంట్ కనుగొన్నారు. ఒక్కరోజే 4,099 కొత్త కేసులు (Coronavirus in Delhi) నమోదైనట్టు తాజా హెల్త్‌ బులిటెన్‌లో ప్రకటించారు. మరోవైపు, రెండు రోజుల ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 4 వేలకు పైగా కరోనా కేసులు (New COVID-19 Cases) నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి జైన్ అసెంబ్లీలో ప్రకటించారు.

డిసెంబరు 30-31న జరిపిన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ రిపోర్టుల్లో 84శాతం నమూనాల్లో ఒమిక్రాన్‌ను గుర్తించారు. 187 నమూనాలను పరీక్షించగా.. అందులో 152 నమూనాల్లో ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలింది. కొత్త వేరియంట్ కారణంగానే దిల్లీలో కేసులు పెరుగుతున్నాయి. అయితే ఒమిక్రాన్‌ బాధితుల్లో తీవ్రమైన లక్షణాలు లేకపోవడంతో ఆసుపత్రుల్లో చేరికలు పెరగట్లేదు. ఇది కాస్త ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది'' అని జైన్‌ తెలిపారు.

దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వారికి ప్రారంభమైన కరోనా టీకాల పంపిణీ, కేంద్రం ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్న అన్ని రాష్ట్రాలు

రోజువారీ కేసులు 4వేలు దాటడం గతేడాది మే తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం ఆందోళన కలిగిస్తోంది. అటు పాజిటివిటీ రేటు 6.46శాతానికి పెరిగినట్లు సోమవారం ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించింది. మరో వారం రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్‌ ఉద్ధృతి నేపథ్యంలో ఇప్పటికే దిల్లీలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. నైట్‌ కర్ఫ్యూతో పాటు స్కూళ్లు, సినిమా హాళ్లు, జిమ్‌ సెంటర్లను మూసివేశారు. బస్సులు, మెట్రోలను 50శాతం సామర్థ్యంతో నడుపుతున్నారు. వేడుకలపైనా పరిమితులు విధించారు. తాజాగా పాజిటివిటీ రేటు పెరగడంతో త్వరలోనే మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది.