COVID-19 Vaccination in India: దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వారికి ప్రారంభమైన కరోనా టీకాల పంపిణీ, కేంద్రం ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్న అన్ని రాష్ట్రాలు

దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయసు కలిగిన టీనేజీ పిల్లలకు కరోనా టీకాల పంపిణీ సోమవారం నుండి ప్రారంభమైంది. వీరికి వ్యాక్సినేషన్‌ (COVID-19 Vaccination in India) కోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే.

COVID-19 Vaccination in India: దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వారికి ప్రారంభమైన కరోనా టీకాల పంపిణీ, కేంద్రం ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్న అన్ని రాష్ట్రాలు
COVID-19 Vaccination (Photo Credits: ANI)

New Delhi, January 3: దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయసు కలిగిన టీనేజీ పిల్లలకు కరోనా టీకాల పంపిణీ సోమవారం నుండి ప్రారంభమైంది. వీరికి వ్యాక్సినేషన్‌ (COVID-19 Vaccination in India) కోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. కొవిన్‌ యాప్‌ డేటా ప్రకారం.. ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది టీనేజర్స్ టీకా (Coronavirus Vaccination in India) కోసం పేరు నమోదు చేసుకున్నారు. వీరికి నేటి నుంచి డోసుల పంపిణీ చేపట్టారు. ఆధార్‌ కార్డు లేని పిల్లలు స్టూడెంట్‌ ఐడీ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.

15-18 ఏళ్ల వారికి టీకా పంపిణీ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సూచించారు. దీంతో అన్ని రాష్ట్రాలు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. ముంబయిలో 9 జంబో సెంటర్లు ఏర్పాటు చేశారు. అస్సాంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. టీనేజీ పిల్లలకు టీకా డ్రైవ్‌ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ టీకా పంపిణీ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ వయసు వారందరికీ కొవాగ్జిన్‌ టీకాను మాత్రమే అందించనున్నారు. తొలి డోసు తీసుకున్న 4 వారాల తర్వాత రెండో డోసును వేస్తారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రి వెల్లడించారు. 2007, అంతకంటే ముందు జన్మించినవారు టీకా వేసుకునేందుకు అర్హులుగా పేర్కొన్నారు.

భారత్‌లో తగ్గేది లేదంటున్న కరోనా, గత 24 గంటల్లో 33,750 కోవిడ్ కేసులు న‌మోదు, నిన్న‌ 10,846 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్

దేశంలో కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ పరిధిని విస్తరిస్తూ కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా అందించనున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా వెల్లడించారు. దీంతో పాటు జనవరి 10 నుంచి ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు ప్రికాషన్‌ డోసును పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రికాషన్‌ డోసుగా ఏ వ్యాక్సిన్‌ వేస్తారన్నది మాత్రం కేంద్రం ఇంకా స్పష్టం చేయలేదు. ఇటీవల కేంద్రం ఆమోదించిన కార్బివాక్స్‌, కొవొవాక్స్‌లను ముందు జాగ్రత్త డోసుగా పంపిణీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

గత ఏడాది జనవరి 16 నుంచి ఇప్పటివరకు దేశంలో అర్హులైనవారిలో 90% మందికి పైగా తొలి డోసు, 65% మందికి రెండు డోసులు అందాయని వెల్లడించింది. తొమ్మిది నెలల కంటే తక్కువ సమయంలోనే 100 కోట్లకు పైగా డోసుల పంపిణీ పూర్తిచేశాం. అర్హులైన పౌరులకు తొలిడోసు అందించడంలో అమెరికా (73.2%), బ్రిటన్‌ (75.9%), ఫ్రాన్స్‌ (78.3%), స్పెయిన్‌ (84.7%)తో పోలిస్తే భారత్‌దే (90% పైగా) ముందంజ. రెండోడోసు విషయంలోనూ ముందున్నాం.'' అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

(The above story first appeared on LatestLY on Jan 03, 2022 02:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).