Mahaboobnagar: సెల్యూట్ సార్.. అనాథ అమ్మాయిని దత్తతకు తీసుకున్న మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావు..
ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానన్నారు. కలెక్టర్ దత్తత తీసుకున్నట్టు ప్రకటించిన ఆ విద్యార్థిని మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని కూచూర్‌కు చెందిన వైష్ణవి. తల్లిదండ్రులు మల్లేష్, అలివేలు గతంలో మృతి చెందారు. అప్పటి నుంచి అమ్మమ్మ లక్ష్మమ్మ, తాత రాంచంద్రయ్య చూసుకుంటున్నారు.
ఆయన ఓ జిల్లా కలెక్టర్. అయినప్పటికీ ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరని తెలుసుకొని చలించిపోయి ఆ అమ్మాయిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయనే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు. ఆదివారం జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మిఖంగా తనిఖీ చేశారు.కె జి బి వి లోని విద్యార్థుల చదువు ,భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆరవ తరగతి చదువుతున్న వైష్ణవికి తల్లిదండ్రులు లేరని తెలుసుకొని ఆ అమ్మాయి అవ్వ ,తాత ల ను పిలిపించి మాట్లాడి వైష్ణవిని తాను దత్తత తీసుకుంటున్నానని ఇకపై వైష్ణవి బాగోగులు తానే చూసుకుంటానని,వైష్ణవి ఎంత చదివితే అంత వరకు చదివిస్తానని హామీ ఇచ్చి అమ్మాయిని దత్తత తీసుకున్నారు.
ఈ సందర్భంగా వైష్ణవి తాను పోలీస్ అవ్వాలనిఆనుకుంటున్నానని తెలుపగా చదివిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె జి బి వి పాఠశాలలో విద్యార్థుల చదువు, మధ్యాహ్న భోజనం ఎలా ఉందని ప్రశ్నించారు.అంతే కాక భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కాగ ప్రస్తుతం ఉన్న పాఠశాలలో వసతి సౌకర్యం ఇబ్బందిగా ఉందని తెలపగా, 15 రోజుల్లో నూతన భవనంలోకి వెళ్లాలని, ఇందుకుగాను భవనాన్నీ హ్యాండోవర్ చేయాల్సిందిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు భోజనాన్ని నాణ్యతగా అందించాలని, అంతేకాక గుణాత్మక విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కేజీబీవీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ మాధవి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.