Telangana: ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లాడేందుకు మతం మార్చుకున్న ముస్లిం యువకుడు, ఆమె కోసం హర్షిత్‌గా మారిన అర్షద్, ప్రేమంటే ఇదేరా! అంటున్న జనం
తన ప్రేయసి దివ్య కోసం అర్షద్ కాస్తా.. హర్షిత్‌గా పేరు మార్చుకున్నాడు. పంచభూతాల సాక్షిగా మూడుముళ్లు వేసి, ఏడు అడుగులతో ఏకమయ్యారు. అనంతరం నూతన వధూవరులు శుక్రవారం ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల ఆశీర్వాదాలు తీసుకున్నారు
Hyderabad, DEC 16: ప్రేమించుకోవడానికి కులం, మతం అవసరం లేదు. పెళ్లికి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. చివరకు జెండర్ కూడా అడ్డుకాదని నిరూపించాడు ఓ యువకుడు. ట్రాన్స్ జెండర్‌ను (marries transgender) వివాహం చేసుకుని, ఆమెకు కొత్త జీవితాన్నిచ్చాడు. బాసటగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన కడూంచి మంగమ్మ-గోపాల్‌కు ముగ్గురు కొడుకులు. రెండో కొడుకు సంపత్. ఇంట్లో నుంచి ఐదేండ్ల క్రితం వెళ్లిపోయిన సంపత్.. ట్రాన్స్‌జెండర్(marries transgender)గా మారాడు. కొద్ది రోజులు జగిత్యాలలో జీవనం కొనసాగించాడు. ఇదే సమయంలో జగిత్యాలకు చెందిన కారు డ్రైవర్ అర్షద్, దివ్య ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని పలుసార్లు ప్రపోజ్ చేశాడు. ఇంతలో దివ్య జమ్మికుంట (Jammikunta) మున్సిపల్ పరిధిలోని హౌజింగ్‌బోర్డు కాలనీకి మారింది. విషయం తెలుసుకున్న అర్షద్ (Arshad) గురువారం జమ్మికుంటకు వచ్చాడు. దివ్యను పెళ్లికి ఒప్పించాడు.
తన ప్రేయసి దివ్య కోసం అర్షద్ కాస్తా.. హర్షిత్‌గా పేరు మార్చుకున్నాడు. పంచభూతాల సాక్షిగా మూడుముళ్లు వేసి, ఏడు అడుగులతో ఏకమయ్యారు. అనంతరం నూతన వధూవరులు శుక్రవారం ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల ఆశీర్వాదాలు తీసుకున్నారు.
అనంతరం హర్షిత్-దివ్య మాట్లాడుతూ వివాహ బంధంతో ఒక్కటైన తాము ఆదర్శవంతంగా ముందుకు సాగుతామని, ఒకరికొకరం గౌరవించుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.