Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, రూ. 18,000 వేల కోట్లు మునుగోడు అభివృద్ధి కి ఇవ్వండి, ఉప ఎన్నికల బరి నుండి తప్పుకుంటామన్న మంత్రి

తెలంగాణా లో జరుగుతున్న అభివృద్ధి ని అడ్డుకోవడానికే ఈ కుయుక్తులు అని ఆయన దుయ్యబట్టారు.

Minister Jagadish Reddy (Photo-TRS Party Office)

Munugode, Oct 10: బిజెపి కుట్రలు కుతంత్రాలతోటే మునుగోడు లో ఉప ఎన్నికలు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణా లో జరుగుతున్న అభివృద్ధి ని అడ్డుకోవడానికే ఈ కుయుక్తులు అని ఆయన దుయ్యబట్టారు.సోమవారం ఉదయం ఆయన మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని కొరటికల్ గ్రామం నుండి ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణా సస్యశ్యామలం అవుతుంటే ఓర్వలేకనే బిజెపి పాలకులు మంటలు సృష్టిస్తున్నారన్నారు.

కుటిల రాజకీయాల కోసం కాకుంటే రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన 18,000 కోట్ల రూపాయలు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.మా డిమాండ్ ను ఒప్పుకునే ధైర్యం మోదీ, అమిత్ షాలకు ఉంటే ఉప ఎన్నికల్లో టి ఆర్ యస్ పార్టీ అభ్యర్థిని కుడా బరిలో ఉంచదని ఆయన బిజెపి కి సవాల్ విసిరారు. అవే 18,000 కోట్లు ఉమ్మడి నల్గొండ జిల్లా కు మంజూరు చేస్తే మా అభ్యర్థిని బరిలో పెట్టొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రాధేయ పడతామన్నారు.వామ పక్షాల నేతల సాక్షిగా చేస్తున్న ఈ ఛాలెంజ్ ను స్వీకరించే దమ్ము ,ధైర్యం బిజెపి కుందా అని ఆయన సవాల్ విసిరారు. హిందూమతం గురించి వేదాలు వల్లించే బిజెపి ప్రభుత్వం యాదాద్రి పునర్ నిర్మాణానికి 100 రూపాయల చందా ఇచ్చిన పాపాన పోలేదన్నారు.

తుపాకీ గురిపెట్టి మహిళపై సీఐ అత్యాచారం, మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వర్‌రావును పోలీస్ శాఖ నుండి తొలగించిన హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌

హిందు మతానికి అంబాసిడర్లు అంటూ డాంబికాలు పలికుతూ ఇతర మతాల మీద విషం చిమ్మే బిజెపి నేతలకు యాదాద్రి పునర్ నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు మనసు అయితే రాలేదు కానీ తెలంగాణలో కుట్రలు కుతంత్రాలకు తెర లేపిన రాజగోపాల్ రెడ్డికి మాత్రం 18,000 కోట్లు అప్పనంగా అప్పగించారాన్నారు.మోదీ,అమిత్ షాల ద్వయం తో పాటు అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు,కేంద్ర మంత్రులు పలుమార్లు తెలంగాణా లో పర్యటించినా పైసా విదిల్చిన పాపాన పోలేదన్నారు.పార్టీ మారి బిజెపి ఎత్తుగడ లో బాగంగా ఉప ఎన్నికలు తెచ్చిన రాజగోపాల్ రెడ్డికి నజరానా గా మాత్రం 18000 కోట్లు ఇచ్చారన్నారు.యావత్ భారత దేశంలోనే ముందెన్నడూ లేని రీతిలో నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద 30,000 కోట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నా కేంద్రంలో కొలువుదీరిన బిజెపి సర్కార్ సాయం చేసింది ఏమి లేదన్నారు.

వడ్డీకే అప్పులు తెచ్చి భవిష్యత్ తరాలకు విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తున్న దార్శనికుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తోడు ఉండాల్సిన కేంద్రం పైసా ఇవ్వక పోగా ఆటంకాలు సృష్టిస్తుందని,పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి కి మాత్రం 18,000కోట్లు ఇచ్చేందుకు మాత్రం వెనుకకు పోలేదన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి 40 వేల రూపాయల ఖర్చుతో ట్రాన్స్మిషన్,సబ్ స్టేషన్ల నిర్మాణాలు,విద్యుత్ ఉప కేంద్రాలు నిర్మిస్తుంటే ఆపన్న హస్తం అందించాల్సిన కేంద్రం మొండి చెయ్యే చూపిందని బిజెపి ఆడుతున్న నాటకంలో పాత్ర దారిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి కి మాత్రం 18000 వేల కోట్లు ఇచ్చిందన్నారు.

కాకతీయుల కాలం నాటి చెరువుల పునరుద్ధరణ కు ముఖ్యమంత్రి కేసీఆర్ 20 వేల కోట్లు ఖర్చు చేస్తే 20 పైసలు కుడా విదిల్చని మోదీ సర్కార్ బిజెపి కుట్రలకు అండగా నిలిచినందుకే కాబోలు రాజగోపాల్ రెడ్డికి 18,000 కోట్లు ఇచ్చినట్లుందన్నారు.అంతెందుకు అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటు ఐక్యరాజ్యసమితి లు సంయుక్తంగా నల్లగొండ జిల్లా మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సురక్షిత మైన త్రాగు నీరు అందించక పోతే ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించినా గత పాలకుల ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.అధికారంలోకి వచ్చిందే తడవుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వీయ నియంత్రణ విధించుకుని మొదలు పెట్టిన మిషన్ భగీరథ పథకానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నీతి ఆయోగ చేసిన సిఫార్సులు బుట్ట దాఖలు చేసిన బిజెపి సర్కార్ తెలంగాణాలో ఆ పార్టీ తల పెట్టిన కుట్రలలో ముఖ్యడు గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాత్రం 18000 కోట్లు ఇచ్చిందని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.

ఇప్పటికీ చెబుతున్న అవే 18000 కోట్లు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కి మంజూరు చెయ్యండి ఇక్కడ పెండింగ్ లో ప్రాజెక్ట్ లు నిర్మిస్తాం.రేపటి ఉప ఎన్నికల్లో అభ్యర్థిని కుడా బరిలో దించమని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. యింకా ఈ కార్యక్రమంలో మునుగోడు ఉప ఎన్నికల్లో టి ఆర్ యస్ నుండి పోటీ చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సిపిఎం నేత మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, సీపీఐ నేత మాజీ శాసనసభ్యుడు పల్లా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



సంబంధిత వార్తలు