Hyd, Oct 10: అత్యాచారం, కిడ్నాప్ ఆరోపణలi ఎదుర్కుంటున్న మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వర్‌రావుపై (Marredpally Inspector) పోలీసు శాఖ కీలక చర్యలు చేపట్టింది. ఆయన్ని పోలీసుశాఖ సర్వీసు నుంచి తొలగించింది. మహిళపై లైంగికదాడి, కిడ్నాప్ (kidnap and rape charges) ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే నాగేశ్వర్‌రావు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నాగేశ్వర్‌రావు ఓ వివాహితను కిడ్నాప్ చేసి, తుపాకీతో బెదిరించి.. లైంగికదాడికి పాల్పడి ఆమె భర్తపైనా దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి.
బాధితురాలు, ఆమె భర్తను కారులో బలవంతంగా తీసుకువెళ్తుండగా ఇబ్రహీంపట్నం వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో సీఐ బారి నుంచి తప్పించుకున్న బాధితులు వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదైంది. సీఐ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఐని మొత్తంగా పోలీసుశాఖ విధుల నుంచి తప్పించారు.