Telangana: రేవంత్‌ రెడ్డి నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు, రెడ్డిల ముసుగులో నాపై హత్యాయత్నం, దాడిపై స్పందించిన తెలంగాణ మంత్రి మల్లారెడ్డి

రెడ్ల సింహ గర్జన సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డిపై (Minister Malla Reddy) ఆదివారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడిపై మంత్రి మల్లారెడ్డి సోమవారం స్పందించారు. మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాపై జరిగిన దాడి వెనుక తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి (PCC Revanth Reddy) హస్తం ఉంది.

Minister-Mallareddy (Photo-Video Grab)

Hyd, May 30: రెడ్ల సింహ గర్జన సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డిపై (Minister Malla Reddy) ఆదివారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడిపై మంత్రి మల్లారెడ్డి సోమవారం స్పందించారు. మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాపై జరిగిన దాడి వెనుక తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి (PCC Revanth Reddy) హస్తం ఉంది. రెడ్డిల ముసుగులో నాపై హత్యాయత్నం జరిగింది. రేవంత్‌ నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నాడు. రేవంత్‌, అతడి గుండాలను జైలుకు పంపుతాము’’ అని తెలిపారు.

కాగా, ‘రెడ్ల సింహ గర్జన’ సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డి సభకు సంబంధించిన అంశాలను కాకుండా పదేపదే టీఆర్‌ఎస్‌ (TRS) పథకాలను, సీఎం కేసీఆర్‌ను ప్రస్తావించడంపై అక్కడున్న వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మల్లారెడ్డి డౌన్‌ డౌన్‌.. మల్లారెడ్డి గో బ్యాక్‌..’అంటూ కుర్చీలు, రాళ్లు, చెప్పులను స్టేజీపైకి విసిరారు. ప్రసంగం మధ్యలోనే ఆపి వెళ్లిపోతున్న మల్లారెడ్డి కాన్వాయ్‌ వెంటపడి మరీ రాళ్లు, చెప్పులు, నీళ్ల బాటిళ్లు విసురుతూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు కష్టమ్మీద వారిని అడ్డుతప్పించి మల్లారెడ్డిని బయటికి తరలించారు.

మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ, చేతికందిన కుర్చీలు, మంచినీళ్ల సీసాలు మంత్రి కాన్వాయ్ పై విసిరిన ఆందోళనకారులు, రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిరసనకారులు డిమాండ్

తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ లో జరిగిన రెడ్డి సింహగర్జన సభకు మల్లారెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఆయన ప్రసంగిస్తుండగా, కొందరు వ్యక్తులు నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వారు ఏమాత్రం శాంతించకపోవడంతో మంత్రి మల్లారెడ్డి తన ప్రసంగాన్ని ఆపేశారు. అయినప్పటికీ నిరసనకారులు రెచ్చిపోవడంతో, ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసనకారులు మల్లారెడ్డి కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. చేతికందిన కుర్చీలు, మంచినీళ్ల సీసాలు కాన్వాయ్ పై విసురుతూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. దాంతో పోలీసులు వలయంగా ఏర్పడి మంత్రిని అక్కడి నుంచి తరలించారు. కాగా, నిరసనకారులు రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో నినాదాలు చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Advertisement
Advertisement
Share Now
Advertisement