Telangana LRS 2024: మూడు నెలల్లో ఎల్‌ఆర్‌ఎస్ పూర్తి చేయాలి, దళారుల ప్రమేయం వద్దు,అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

నిబంధనల ప్రకారమే భూముల క్రమబద్దీకరణ చేయాలని మూడు నెలల్లో ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ పూర్తి చేయలని ఆదేశించారు. అలా గే ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు.

Telangana Minister Ponguleti Srinivas Reddy about guidelines for LRS applications (X)

Hyd, Aug 3: తెలంగాణలో ఎల్‌ఆర్ఎస్ ప్రక్రియపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నిబంధనల ప్రకారమే భూముల క్రమబద్దీకరణ చేయాలని మూడు నెలల్లో ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ పూర్తి చేయలని ఆదేశించారు. అలా గే ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రభుత్వం మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలో ముఖ్యంగా ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటుచేయాలని సూచించారు. క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీచేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్ లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో హెల్ప్ డేస్క్ ఏర్పాటు చేయాలన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఆథారిటీ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని తెలిపారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాలల్లో అత్యంత విలువైన భూములు ఉన్నాయని ఈ జిల్లాల్లో లేఅఔట్ ల క్రమబద్దీకరణ విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆమోదించబడిన లేఅవుట్ యజమానులకు ఇంటి నిర్మాణాలకు భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు, బ్యాంకు రుణాలు పొందేందుకు, కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి సహాయపడుతుందన్నారు.  తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, ఎస్సీ శాఖ కమిషనర్‌గా శ్రీదేవి, అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి

గత ప్రభుత్వం ఆగస్టు 31 నుండి అక్టోబర్ 31, 2020 వరకు ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను ఆమోదించిందన్నారు. ఈ సమయంలో 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయని, గత నాలుగు సంవత్సరాలుగా ఈ దరఖాస్తులు ఎలాంటి పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు మంత్రి పొంగులేటి. మొత్తం 25.70 లక్షల దరఖాస్తుల్లో హెచ్‌ఎండీఏ పరిధిలో 3.58 లక్షలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పరిధిలో 13.69 లక్షలు మరియు గ్రామ పంచాయతీల్లో 6 లక్షలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటి పరిధిలో 1.35 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు.



సంబంధిత వార్తలు