HC Rejects Srinivas Goud Plea: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో చుక్కదురు, తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ కొట్టేయాలనే అభ్యర్థనను తోసి పుచ్చిన ధర్మాసనం

తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.

Telangana Minister Srinivas Goud (Photo-Twitter)

తెలంగాణ రాష్ట్ర యువజన వ్యవహారాలు & రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ.శ్రీనివాస్‌గౌడ్‌కు మంగళవారం హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.

కొత్తగూడెం ఎమ్మెల్యేపై అనర్హత వేటు, జలగం వెంకట్రావ్‌ను కొత్త ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

ఎన్నికల అఫిడవిట్‌లో శ్రీనివాస్‌గౌడ్‌ తప్పుడు ధ్రుృవపత్రాలు సమర్పించారని, శ్రీనివాసగౌడ్‌ ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి పిటిషన్‌ వేశాడు. అయితే దీనిని కొట్టేయాలంటూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హైకోర్టును ఆశ్రయించారు. రాఘవేంద్రరాజు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, శ్రీనివాస్‌గౌడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను మాత్రం కొట్టేసింది.