Telangana Municipal Elections: మూడేళ్లకే ఓటు హక్కు, బిత్తరపోయిన తల్లిదండ్రులు, కరీంనగర్ జిల్లా ఓటరు జాబితాలో పేరు, వెంటనే తొలగించాలని కోరిన పాప తండ్రి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓటరు ఐడి కార్డు

అయితే తెలంగాణాలో (Telangana) కరీంనగర్ జిల్లాలో (karimnagar) మాత్రం ఇది రివర్స్ అయింది. కేవలం మూడేళ్లకే ఓ చిన్నారికి ఓటు హక్కు వచ్చింది. తెలంగాణాలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు (Telangana Muncipal Elections)ఉన్న నేపథ్యంలో అధికారులు విడుదల చేసిన ఓటరు ముసాయిదా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరీంనగర్‌ నగరపాలకసంస్థ పరిధిలోని ఓ మూడేళ్ల చిన్నారిని ఓటరు ముసాయిదాలో చేర్చారు.

voter-id-issued-for-3-years-girl-in-karimnagar-district (Photo-Social Media-Twitter)

Hyderabad,January 04: సాధారణంగా భారత దేశంలో (India)ఓటు హక్కు పొందాలంటే 18ఏళ్లు నిండాలన్న నిబంధనలు ఉన్నాయి. అయితే తెలంగాణాలో (Telangana) కరీంనగర్ జిల్లాలో (karimnagar) మాత్రం ఇది రివర్స్ అయింది. కేవలం మూడేళ్లకే ఓ చిన్నారికి ఓటు హక్కు వచ్చింది. తెలంగాణాలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు (Telangana Municipal Elections)ఉన్న నేపథ్యంలో అధికారులు విడుదల చేసిన ఓటరు ముసాయిదా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరీంనగర్‌ నగరపాలకసంస్థ పరిధిలోని ఓ మూడేళ్ల చిన్నారిని ఓటరు ముసాయిదాలో చేర్చారు.

కరీంనగర్‌లో ఓటర్‌ ఐడీ వైఓజే 8588352 నంబర్‌పై నందిత మెతుకు పేరిట నమోదు అయింది. నందిత వయస్సు 35ఏళ్లుగా, ఇంటినంబర్‌ 5–6–434గా ప్రచురించారు. వీటిని చూసిన నందిత తండ్రి మెతుకు రమేశ్‌ అవాక్కయ్యాడు. తమకూతురు నందిత వయస్సు 3ఏళ్లని, ఎల్‌కేజీ చదువుతోందని తెలిపాడు. అధికారులు స్పందించి వెంటనే ఓటర్‌ లిస్ట్‌ (voter List) నుంచి తమ కూతురుపేరు తొలగించాలని కోరాడు.కాగా ఆ పాపకు ఏడాది వయసున్నప్పుడు తీసిన ఫొటోను ఐడీ కార్డుపై ముద్రించారు.

అర్హతున్న వారికి ఓటుహక్కు ఇవ్వని అధికారులు ఇలా మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కును కల్పించడంతో అధికారుల చిత్తశుద్ధి ఇలా ఉందంటూ సోషల్ మీడియా (Social Media) వేదికగా విమర్శలు చేస్తున్నారు. ఓటర్ లిస్టులో తప్పులు, అక్రమాలపై స్థానికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.