CM KCR Press Meet Update: మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్, 90 శాతం పైగా గెలుపుతో గులాబీ పార్టీ సత్తా, మరికాసేపట్లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడనున్నారు.....
Hyderabad, January 25: ఎన్నికలు ఏవైనా తెలంగాణలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుది సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో, నిన్నటి స్థానిక ఎన్నికల్లో, నేటి పురపాలక ఎన్నికల్లో 90 శాతం పైగా సీట్లు గెలిచి తెరాస (TRS Party) సత్తా చాటింది. జనవరి 22న 120 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. 120 మున్సిపాలిటీల్లో 110 చోట్ల టీఆర్ఎస్ పార్టీ ముందజలో ఉండగా, 9 కార్పొరేషన్లలో తొమ్మిందింటికీ, తెరాసనే ఏకపక్షంగా ఆధిక్యతను కనబరుస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ పోటీలు కనీస పోటీ ఇవ్వలేక అతితక్కువ స్థానాలకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం 04, బీజేపీకి ఇంకా తక్కువగా 02, ఇతరులకు 04 మున్సిపాలిటీలు దక్కాయి.
మరోసారి ఇంతటి ఘనవిజయం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతగా మధ్యాహ్నం 4 గంటలకు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. సీఎ ప్రెస్ మీట్ సమగ్ర కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేసి చూడండి
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడనున్నారు. అలాగే మేయర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈనెల 27న మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక జరగనుంది.