Hyderabad Murder Case: హైదరాబాద్‌లో తొలిసారి, భార్యను పొడిచి చంపిన భర్తకు ఉరిశిక్ష విధించిన కోర్టు, కత్తెరతో గొంతులో, స్క్రూ డ్రైవర్‌తో ప్రైవేట్ భాగాల్లో దారుణంగా..
2018కి సంబంధించిన ఓ కేసులో నిందితుడు ఇమ్రాన్ ఉల్ హక్‌ను దోషిగా తేల్చిన కోర్టు ఉరిశిక్ష (gets death sentence for murder) విధిస్తూ తీర్పును వెల్లడించింది.
Hyd, Jan 19: భార్యను అత్యంత కిరాతకంగా హత్యచేసిన భర్తకు (Hyderabad man stabs wife in throat with scissors) నాంపల్లి క్రిమినల్ కోర్టు మరణశిక్షను విధించింది. 2018కి సంబంధించిన ఓ కేసులో నిందితుడు ఇమ్రాన్ ఉల్ హక్‌ను దోషిగా తేల్చిన కోర్టు ఉరిశిక్ష (gets death sentence for murder) విధిస్తూ తీర్పును వెల్లడించింది. అయితే, హైదరాబాద్‌లో ఒక నిందితుడికి ఉరిశిక్ష విధించడం ఇదే మొదటిసారి.మరణశిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా కూడా విధిస్తూ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ సీవీ ఎస్ సాయిభూపతి తీర్పు వెలువరించారు.
యూపీలో దారుణం, భర్త టీ అడిగాడని కత్తెరతో దారుణంగా కంటిపై పొడిచిన భార్య, అనంతరం ఇంట్లో నుంచి పరార్
కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. కారు డ్రైవర్ అయిన ఇమ్రాన్ జనవరి 2019లో ఈ దారుణ హత్యకు పాల్పడ్డాడు. సొంతంగా కారు కొనుక్కొనేందుకు రూ. 30 వేలు కావాలని భార్యను డిమాండ్ చేశాడు. అందుకామె నిరాకరించడంతో జనవరి 6న కత్తెరతో భార్య గొంతులో పొడిచాడు. ఆపై సుత్తితో తలపై ( hits her head with hammer) మోదాడు. ప్రైవేటు భాగాల్లో స్క్రూ డ్రైవర్ చొప్పించాడు. దాంతో ఆమె చనిపోయింది. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు.
ఈ ఘటనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడు ఇమ్రాన్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది.