Hyderabad Shocker: కల్లు తాగిన మత్తులో మహిళ, చీకటి ప్రదేశానికి తీసుకువెళ్లి ముగ్గురు సామూహిక అత్యాచారం, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో దారుణ ఘటన
stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Hyd, Oct 14: జీహెచ్ఎంసీ పరిధిలో దారుణం (Hyderabad Shocker) చోటుచేసుకుంది. రాజేంద్రనగర్‌లో కొందరు దుండగులు ఓ మహిళను ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి (30-Year-Old Woman Allegedly Gang-Raped) పాల్పడ్డారు. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడు, నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితురాలు రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫురానాపూల్‌కు చెందిన మహిళ (30) రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలోని హైదర్‌గూడకు బుధవారం సాయంత్రం వచ్చింది. స్థానికంగా ఉండే ఓ కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగేందుకు వెళ్లింది. అక్కడ పక్కనే కూర్చున్న ఓ ఆటో డ్రైవర్‌ మహిళను గమనించి ఆమెతో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో మాటా మాటా కలుపుతూ ఆమెను ఇంటి దగ్గర దించి వెళ్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన మహిళ ఆటోలో వెళ్లింది. మరో ఇద్దరు వ్యక్తులు కూడా అదే ఆటో ఎక్కారు. అక్కడి నుంచి ఆమెను హిమాయత్‌సాగర్‌ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ముగ్గురు వ్యక్తులు (Three Persons Near Himayat Sagar) ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

దుర్మార్గపు భర్త.. భార్యను చంపేందుకు నాగుపామును వదిలాడు, అది కాటేయడంతో భార్య మృతి, నిందితుడికి జీవిత ఖైదు విధించిన కేరళ కోర్టు

అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. మత్తు నుంచి కోలుకున్న బాధితురాలు గురువారం ఉదయం స్థానికుల సహకారంతో రాజేంద్రనగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు సీఐ కనకయ్య తెలిపారు.