Telangana LRS Scheme 2024: రుణమాఫీ తరహాలోనే ఎల్‌ఆర్‌ఎస్, వారికే వర్తింపు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, హెల్ప్‌లైన్‌లను సంప్రదించి మీ దరఖాస్తు స్టేటస్ చెక్‌చేసుకోండి
ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేయగా తాజాగా ఎల్‌ఆర్‌ఎస్‌పై ఉత్తర్వులు వెలువరించింది ప్రభుత్వం. 2020 ఆగస్ట్ 26కు ముందు రిజిస్టర్ చేసిన లేఔట్లకే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని తెలిపింది. 2020 అక్టోబర్ 15 వరకు స్వీకరించిన దరఖాస్తులనూ మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. ఇందుకు సంబంధించి 2020లో జారీ చేసిన జీవో 131, జీవో 135 ప్రకారం రాష్ట్రంలో అక్రమ లేఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గైడ్‌లైన్స్ సిద్ధం చేసింది.
Hyd, Aug 16: లేఔట్ రిజిస్ట్రేషన్ స్కీమ్(LRS)పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేయగా తాజాగా ఎల్‌ఆర్‌ఎస్‌పై ఉత్తర్వులు వెలువరించింది ప్రభుత్వం. 2020 ఆగస్ట్ 26కు ముందు రిజిస్టర్ చేసిన లేఔట్లకే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని తెలిపింది. 2020 అక్టోబర్ 15 వరకు స్వీకరించిన దరఖాస్తులనూ మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. ఇందుకు సంబంధించి 2020లో జారీ చేసిన జీవో 131, జీవో 135 ప్రకారం రాష్ట్రంలో అక్రమ లేఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గైడ్‌లైన్స్ సిద్ధం చేసింది.
ఇప్పటి వరకు దాదాపు 4.28 లక్షలకు పైగా దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్లు తెలిపారు అధికారులు. ఎల్ఆర్ఎస్‌కు 60,213 దరఖాస్తులు ఆమోదం పొందగా, రూ.96.60 కోట్లు వసూలైనట్లు చెప్పారు. 75 శాతం దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు.
2020 అక్టోబర్ 15 వరకు స్వీకరించిన దరఖాస్తుల్లో అర్హులకు పూర్తి డాక్యుమెంట్లను సమర్పించేందుకు గడువు ఇచ్చినట్లు చెప్పారు. సేల్ డీడ్, మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్, లేఔట్ కాపీలను అప్ లోడ్ చేయవచ్చునన్నారు. మొబైల్ నెంబర్, చిరునామా, ఇతర వివరాలతో పాటు ఓటీపీని ఉపయోగించి సవరించుకోవాలని సూచించారు. హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామని వారిని సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు అన్నారు. హైదరాబాద్‌లో కుండపోత వర్షం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక, మరో 5 రోజులు వర్షాలు, విపత్తు సంభవిస్తే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచన
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2020లో ఆగస్టు31 నుంచి అక్టోబర్31 వరకు రెండు నెలల పాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది అప్లికేషన్లు సమర్పించారు. ఇందులో కార్పొరేషన్లలో 4.13 లక్షలు, మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
ఇక ఇప్పటికే రుణమాఫీ విషయంలో అధికార కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. రుణమాఫీ 40 వేల కోట్లు అని ఎన్నికల సమయంలో చెప్పి తీరా 18 వేల కోట్లకే పరిమితం చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రైతులందరికి రుణమాఫీ కాలేదని చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్ విషయంలోనూ ఇదే జరుగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.