Heavy rain in many parts of Hyderabad, Yellow alert issued ,IMD says 5 days rains in Telangana

Hyderabad, Aug 16: గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. బోయిన్‌పల్లి, అల్వాల్, సికింద్రాబాద్, పటాన్‌చెరు, జూబ్లీహిల్స్, ఆర్సీపురం, అమీన్ పూర్, అమీర్‌పేట్, హైటెక్ సిటీ సహా పలు ప్రాంతాల్లో నాన్‌స్టాప్‌గా కురుస్తోంది. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు...విపత్తు సంభవిస్తే టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు అధికారులు.

ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. విపత్తు సంభవిస్తే వెంటనే 040-21111111, 9000113667 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. నాన్‌స్టాప్ వర్షంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు రెయిన్ అల‌ర్ట్, రెండు రోజుల పాటూ ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు ప‌డుతాయ‌ని హెచ్చ‌రిక‌

 హైద‌రాబాద్‌లో గురువారం రాత్రి కురిసిన వర్షానికే నగరం అతలాకుతలమైంది. మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ధికారులు. వ‌ర్షాల‌తోపాటు ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల‌ వేగంతో ఈదురుగాలులు వీస్తాయ‌ని తెలిపారు.

Here's Tweet:

 తాజాగా ఇవాళ కూడా భారీ వర్షం పడటంతో అమీర్ పేట, సనత్ నగర్, ముషీరాబాద్, జీడీమెట్ల, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, నాంపల్లి, కోఠి, తిరుమలగిరి, వనస్థలిపురం, గండిమైసమ్మ, మలక్ పేట ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ప్యాట్నీ, బేగంపేట, చిలకలగూడ, బాచుపల్లి, ప్రగతి నగర్, ఖైరతాబాద్, మారేడ్‌పల్లి, మేడ్చల్, దుండిగల్, చైతన్యపురిలో రోడ్లపైకి నీళ్లు చేరాయి.

Here's Video: